వై.ఎస్. వివేకా హత్య కేసు.. జగన్ యు-టర్న్ ! నత్తనడకన సీబీఐ దర్యాప్తు

jagan fails to order probe he wanted as opposition leader he had sought cbi probe, వై.ఎస్. వివేకా హత్య కేసు.. జగన్ యు-టర్న్ ! నత్తనడకన సీబీఐ దర్యాప్తు

కడపజిల్లా పులివెందులలో వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. అయితే ఈ మర్డర్ పై విచారణ, దర్యాప్తునకు సంబంధించి ఏపీలో జగన్ ప్రభుత్వం ఇప్పటికీ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. రోజురోజుకీ ఈ కేసు మలుపులమీద మలుపులు తిరుగుతూ.. ‘ డీలా ‘ పడుతుండగా సీబీఐ విచారణ నత్తనడకన సాగుతోంది. ఈ ఘటనను ఎలా డీల్ చేయాలో తెలియక.. ప్రభుత్వం తల పట్టుకుంటోంది. సిట్ విచారణలో నిందితులుగా పేర్కొన్న ఎర్ర గంగిరెడ్డి, ప్రకాష్, మరొకరికి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఇటీవలే మరో నిందితుడు శ్రీనివాసులురెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే పోలీసులు తనను వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.

ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్.. తన బాబాయి వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా నాడు ఇదేవిధమైన డిమాండ్ చేసిన విషయం గమనార్హం. తాజాగా ఈ హత్యపై జగన్ ప్రభుత్వం యు-టర్న్ తీసుకున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం ఈ హత్యలో తమ వైసీపీ కి చెందిన నేతకో, కార్యకర్తకో ప్రమేయం ఉందనే విషయం బయటపడితే అది ఈ పార్టీకి ఇరకాటపరిస్థితిని సృష్టిస్తుంది. సిట్ విచారణ సరే.. సీబీఐ దర్యాప్తులో ఈ అంశం పొక్కిన పక్షంలో ప్రభుత్వానికి పెను చిక్కులు తప్పవన్నట్టే.. వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా సీబీఐ దర్యాప్తు కోరడానికి వెనకడుగు వేసింది.

కారణం.. తమ పార్టీ నేతల హస్తం ఏమైనా ఉంటే అది కూడా బయటపడుతుందనే.. వివేకా మర్డర్ పై రాజకీయంగా ఎలా ముందుకు సాగాలన్నదానిపై జగన్ సర్కార్ తర్జనభర్జనలు పడుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీకి, బీజేపీకి మధ్య రాజకీయంగా ఉన్న ‘ ఈక్వేషన్స్ ‘ ఆధారంగా దర్యాప్తు సంస్థ ఈ కేసును ఎలా డీల్ చేస్తుందన్నది ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *