కుటుంబ సర్వేపై జగన్ కీలక ఆదేశాలు

ఏపీవ్యాప్తంగా ప్రతీ కుటుంబంలో కరోనా సర్వే నిర్వహించేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే మొదటి, రెండు దశల కుటుంబ సర్వే పూర్తి అయినందున మిగిలిన అన్ని కుటుంబాల్లోను కరోనా సర్వే పూర్తి చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు.

కుటుంబ సర్వేపై జగన్ కీలక ఆదేశాలు
Follow us

|

Updated on: Apr 09, 2020 | 4:13 PM

ఏపీవ్యాప్తంగా ప్రతీ కుటుంబంలో కరోనా సర్వే నిర్వహించేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే మొదటి, రెండు దశల కుటుంబ సర్వే పూర్తి అయినందున మిగిలిన అన్ని కుటుంబాల్లోను కరోనా సర్వే పూర్తి చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు. సర్వే సమగ్రంగా వుండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. కోవిడ్ నివారణా చర్యలపై సీఎం జగన్ గురువారం అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమీక్షా సమావేశానికి ముందు దేశంలో కరోనా వైరస్ విస్తరణ, నమోదవుతున్న కేసులు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, వివిధ అధ్యయనాలపై సీఎంకు వివరాలు అందించారు ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి. ఆ గణాంకాల ఆధారంగా సమీక్ష జరిగిన ముఖ్యమంత్రి కుటుంబ సర్వేపై కీలక ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికే జరిగిన మొదటి, రెండు కుటుంబాల వారీ సర్వేపై సీఎం ఆరా తీశారు. కోవిడ్‌–19 విపత్తు నేపథ్యంలో రవాణా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది.

ధాన్యం రవాణాకు ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, ఆమేరకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. రవాణాలో కూడా నిల్వ చేయలేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. మిర్చి మార్కెట్‌యార్డులను రెడ్‌జోన్, హాట్‌స్పాట్లకు దూరంగా వికేంద్రీకరణ చేస్తున్నట్టుగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వ్యవసాయ ఉత్పత్తి ఉన్నచోటే మార్కెట్‌యార్డులను పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రైతులు బహిరంగ మార్కెట్లో తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవాలని అనుకుంటే వారికి పూర్తిగా సహకరించేలా రవాణా సౌకర్యాలు కల్పించాలని సీఎం నిర్దేశించారు.