ముస్లింలకు జగన్ కీలక ఆదేశాలు

ఏపీలో రంజాన్ నెల ప్రత్యేక ప్రార్థనలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మత పెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కరోనా ప్రభావం ఒకవైపు పెరుగుతుండడం, లాక్ డౌన్ ఇంపార్టెన్స్ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకోవడంతో ముస్లిం మత పెద్దలతో...

ముస్లింలకు జగన్ కీలక ఆదేశాలు
Follow us

|

Updated on: Apr 20, 2020 | 6:05 PM

ఏపీలో రంజాన్ నెల ప్రత్యేక ప్రార్థనలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మత పెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కరోనా ప్రభావం ఒకవైపు పెరుగుతుండడం, లాక్ డౌన్ ఇంపార్టెన్స్ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకోవడంతో ముస్లిం మత పెద్దలతో సమావేశం కావాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి, సోమవారం వారితో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు.

ఈ వీడియోకాన్ఫరెన్సులో ముస్లిం మత పెద్దలతోపాటు జిల్లా కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదేనని కానీ, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ఈసారి రంజాన్ ప్రార్థనలను ఎవరి ఇళ్ళలో వారు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలే తెలిపిన ముఖ్యమంత్రి, కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పండుగలన్నీ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, ఇప్పుడు రంజాన్‌ నెల కూడా వచ్చిందని ఆయనన్నారు.

ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రంజాన్‌మాసంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలందరినీ అభ్యర్థిస్తున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘ ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి ’’ అని సీఎం అన్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు