పరిపాలనలో సరికొత్త మార్పు.. జగన్ ఏం చేశారంటే?

ఆరు నెలల క్రితం ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టినప్పట్నించి వైఎస్ జగన్ దూకుడు ప్రదర్శిస్తూనే వున్నారు. అవినీతిరహితంగా తన పాలన వుంటుందన్న జగన్ అందుకనుగుణంగా పలు చర్యలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ విధానంతో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇదే కోవలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏపీలో కొత్తగా మరో ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త ప్రభుత్వ శాఖను రూపకల్పన చేశారు. ఈ […]

పరిపాలనలో సరికొత్త మార్పు.. జగన్ ఏం చేశారంటే?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 09, 2019 | 7:11 PM

ఆరు నెలల క్రితం ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టినప్పట్నించి వైఎస్ జగన్ దూకుడు ప్రదర్శిస్తూనే వున్నారు. అవినీతిరహితంగా తన పాలన వుంటుందన్న జగన్ అందుకనుగుణంగా పలు చర్యలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ విధానంతో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇదే కోవలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ఏపీలో కొత్తగా మరో ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త ప్రభుత్వ శాఖను రూపకల్పన చేశారు. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పాటయ్యింది. ఒక కార్యదర్శి, అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి..ఆవిష్కరణల విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కొత్త శాఖ ద్వారా అధికారుల్లో నైపుణ్యాన్ని సమయానుకూలంగా పెంపొందించడానికి ఉద్దేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సాంకేతిక పరిఙ్ఞానాన్ని పెంపొందించేందుకే ఈ కొత్త శాఖ ఆవిష్కరణ అని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.