జగన్ నిర్ణయం 25లక్షల కుటుంబాలకు వరం.. ఉగాదే ముహూర్తం

ఏపీలో సొంతిల్లు లేని అభాగ్యులుండొద్దన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ భారీ లక్ష్యానికి ఉగాదిని గడువుగా నిర్దేశించారు. వచ్చే ఉగాది నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. 25 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలతో కూడిన ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్. నిజానికి ఈ కార్యక్రమానికి గత నెలలోనే బీజం వేశారు జగన్. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అభిప్రాయాలకు తేడా రావడంతో విధి విధానాల […]

జగన్ నిర్ణయం 25లక్షల కుటుంబాలకు వరం.. ఉగాదే ముహూర్తం
Follow us

|

Updated on: Nov 09, 2019 | 2:07 PM

ఏపీలో సొంతిల్లు లేని అభాగ్యులుండొద్దన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ భారీ లక్ష్యానికి ఉగాదిని గడువుగా నిర్దేశించారు. వచ్చే ఉగాది నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. 25 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలతో కూడిన ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్. నిజానికి ఈ కార్యక్రమానికి గత నెలలోనే బీజం వేశారు జగన్.

కానీ ముఖ్యమంత్రి ఆదేశాలకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అభిప్రాయాలకు తేడా రావడంతో విధి విధానాల జారీ, లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాల రూపకల్పన వాయిదా పడింది. తాజాగా ఎల్వీ స్థానంలో ఇంచార్జి సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టడంతో లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించే దిశగా తొలి అడుగు పడింది.

ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు సమకూర్చే లక్ష్యంలో భాగంగా ఈ భారీ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రూపొందించారు. 2020 సంవత్సరం ఉగాది రోజున 25 లక్షల మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలతో సహా ఇళ్ళ పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సీసీఎల్‌ఏ, ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు ఆదేశాలిచ్చారు. దాంతో ఈ అంశంపై శుక్రవారం ఏపీ సెక్రెటేరియట్‌లో వీరిద్దరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సీఎస్, సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకూ 22 లక్షల వరకు లబ్ధిదారుల గుర్తింపు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారుల గుర్తింపును త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ముందుగా గుర్తించి, వాటిలో ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అనువుగా ఉన్న భూములేమిటనేది నోటిఫై చేయాలన్నారు.

లిటిగేషన్‌లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించి ఆ భూములను కూడా ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గుర్తించిన భూములన్నీ గ్రామాల వారీ మ్యాపింగ్‌ చేసి, వివరాలను సీసీఎల్ఏ అధికారులతో షేర్ చేసుకోవాలని చెప్పారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..