జగన్‌ను ఫాలో అవుతున్న ఆ కాంగ్రెస్ సీఎం ఎవరు?

AP CM Jagan, జగన్‌ను ఫాలో అవుతున్న ఆ కాంగ్రెస్ సీఎం ఎవరు?

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు కానీ..పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. అనూహ్యంగా..అనుభవం లేకపోయినా సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తి సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్థానిక పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్లు…రివర్స్ టెండరింగ్ వంటి అంశాలు పక్క రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న నిర్ణయం పక్క రాష్ట్రాల సీఎంలను కూడా ఆకర్షిస్తుంది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎం ఒకరు తమ రాష్ట్రంలో అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. అవును… రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్రంలో ప్రయవేటు రంగంలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రణాళికులు రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలోని పెద్ద పరిశ్రమలకు ప్రభుత్వం ఆర్థికపరమైన ప్యాకేజీల రూపంలో లబ్ధి కలిగిస్తున్నందున ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తున్నది. పబ్లిక్‌ ప్రయివేటు పార్టనర్‌షిప్‌ (పిపిపి), చిన్న తరహా పరిశ్రలు మొదలైన వాటిలో స్థానికులకు ఉద్యోగాలను కల్పించే విధంగా పథకాలను రూపొందిస్తున్నది. ఇతర రాష్ట్రాలు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర యువత కోసం తామెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రసాది లాల్‌ మీనా అన్నారు.

కాగా జగన్‌ కాంగ్రెస్ పార్టీకి అంటే ఆమడ దూరం పాటిస్తున్నారు. తనను ఓదార్పు యాత్ర చేయకుండా అడ్డుకుంది..జైలు పాలు చేసింది..కాంగ్రెస్సే అన్న ఫీలింగ్ సీఎం జగన్‌లో బలంగా ఉంది. కాంగ్రెస్ కూడా జగన్ పట్ల అదే వైఖరిని అవంలభిస్తోంది.  సోనియా, రాహుల్ గాంధీలకు అశోక్ గెహ్లాట్ అత్యంత సన్నిహితంగా ఉండే నేత. మొన్నటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత అక్కడ సచిన్ పైలట్ సీఎం సీటు కోసం ప్రయత్నించినా రాహుల్, సోనియాలు గెహ్లోట్‌కే పట్టం కట్టారు. అలాంటి గహ్లోట్ ఇప్పుడు రాహుల్, సోనియాలకు పెద్దగా నచ్చని జగన్ ఆలోచనను ఫాలో అవ్వాలనుకోవడం కాస్త కఠినతరమైన విషయమే. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం గెహ్లట్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.

ఇక మరోవైపు జగన్ రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది. ఒకవైపు కేంద్రం వార్నింగ్ ఇస్తున్నా..మరోవైపు ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తున్నా..పెద్దగా పట్టించుకోని జగన్ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళి ఊహించని విజయాన్ని సాధించారు. ఇక నిర్ణయం కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

AP CM Jagan, జగన్‌ను ఫాలో అవుతున్న ఆ కాంగ్రెస్ సీఎం ఎవరు?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *