కలిసి అడుగేద్దాం.. జలాల సద్వినియోగంపై ఇరురాష్ట్రాల సీఎంలు

తెలుగురాష్ట్రాల  సీఎంల సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటలపాటు సాగిన ఈ సమావేంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ విభజన సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు.శుక్రవారం ప్రగతిభవన్‌లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమత్రుల భేటీలో జలవనరులకు సంబంధించిన పలు అంశాలపై సీరియస్‌గా చర్చించారు.  గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించేందుకు ఇరురాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. . నీటి కోసం ట్రిబ్యునల్స్, కోర్టుల చుట్టూ తిరగడం కంటే చర్చల ద్వారానే పరిష్కారించుకోవాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ […]

కలిసి అడుగేద్దాం.. జలాల సద్వినియోగంపై  ఇరురాష్ట్రాల సీఎంలు
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 5:48 PM

తెలుగురాష్ట్రాల  సీఎంల సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటలపాటు సాగిన ఈ సమావేంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ విభజన సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు.శుక్రవారం ప్రగతిభవన్‌లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమత్రుల భేటీలో జలవనరులకు సంబంధించిన పలు అంశాలపై సీరియస్‌గా చర్చించారు.  గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించేందుకు ఇరురాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. . నీటి కోసం ట్రిబ్యునల్స్, కోర్టుల చుట్టూ తిరగడం కంటే చర్చల ద్వారానే పరిష్కారించుకోవాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించాని . తెలుగు రాష్ట్రాలభివృద్ధికోసం కలిసి నడుద్దామనుకున్నామన్నారు. మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగామని, అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.