ఆర్టీసీ సమ్మెలోకి అమిత్‌షా ఎంట్రీ…జెఎసీ అనూహ్య నిర్ణయం

ఆర్టీసీ సమ్మె కొత్త మార్గంలో మరింత జోరుకానుందా ? ఆర్టీసీ జెఎసీ తీసుకున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్దమవుతున్నట్లే కనిపిస్తోంది. కార్మికులంతా కలిసి ఉద్యమించడంతోపాటు ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థి, మహిళా సంఘాలను కూడా కలుపుకుని ప్రభుత్వంపై సమరం సాగించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసీ శనివారం నిర్ణయించింది. వచ్చే వారమంతటికి యాక్షన్ ప్లాన్‌ను ఫైనలైజ్ చేసిన జెఎసీ… అనూహ్యంగా ఆర్టీసీ సమ్మె […]

ఆర్టీసీ సమ్మెలోకి అమిత్‌షా ఎంట్రీ...జెఎసీ అనూహ్య నిర్ణయం
Follow us

|

Updated on: Nov 02, 2019 | 5:00 PM

ఆర్టీసీ సమ్మె కొత్త మార్గంలో మరింత జోరుకానుందా ? ఆర్టీసీ జెఎసీ తీసుకున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్దమవుతున్నట్లే కనిపిస్తోంది. కార్మికులంతా కలిసి ఉద్యమించడంతోపాటు ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థి, మహిళా సంఘాలను కూడా కలుపుకుని ప్రభుత్వంపై సమరం సాగించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసీ శనివారం నిర్ణయించింది.
వచ్చే వారమంతటికి యాక్షన్ ప్లాన్‌ను ఫైనలైజ్ చేసిన జెఎసీ… అనూహ్యంగా ఆర్టీసీ సమ్మె అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించింది. నవంబర్ 4,5 తేదీలలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను జెఎసీ బృందం కల్వనుందని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. ఇందుకోసం అపాయింట్‌మెంట్ కోరనున్నట్లు ఆయన తెలుపగా.. అపాయింట్‌మెంట్ బాధ్యతలను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అప్పగించారని అందుకే జెఎసీ భేటీ కంటే ముందే అశ్వత్థామ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారని సమాచారం. ఈ భేటీకి ప్రొ.కోదండరామ్ కూడా హాజరవడం వెనుక ఆంతర్యం కేంద్రాన్ని ఇన్‌వాల్వ్ చేయాలన్న వ్యూహమేనని తెలుస్తోంది.
ఆ తర్వాత హైదరాబాద్ విద్యానగర్‌లోని ఎంప్లాయిస్ యూనియన్‌ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ, విపక్షనేతల సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో తీసుకున్నపలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఈ నిర్ణయాలను వెల్లడించారు. నవంబర్ 3వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాలుగో తేదీన రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్షలు జరపాలని, 5న సడక్ బంద్‌తో రహదారులను దిగ్బంధించాలని తలపెట్టారు.
నవంబర్ 6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు నిరసన తెలపాలని, 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్షలు చేయాలని నిర్ణయించినట్లు అశ్వత్థామరెడ్డి వివరించారు. నవంబర్ 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు చేపట్టి.. నవంబర్ తొమ్మిదో తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై దీక్ష చేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని, బస్ రూట్లను వేరు చేసే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్వత్థామరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు.
మిలియన్ మార్చ్ ఖాయమా ?
నవంబర్ 9వ తేదీన ట్యాంక్ బండ్‌పై ధర్నా చేస్తామని అశ్వత్థామరెడ్డి చెబుతున్నప్పటికీ.. అది మిలియన్ మార్చ్‌గా నిర్వహించాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో నిర్వహించిన హిస్టారిక్ మిలియన్ మార్చ్ తరహాలోనే రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల శ్రేణులను పెద్ద ఎత్తున సమీకరించాలని భావిస్తున్నారు. ముందుగానే మిలియన్ మార్చ్ అంటే ప్రభుత్వ నిర్బంధ చర్యలు ప్రారంభమవుతాయన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ట్యాంక్ బండ్‌పై ధర్నా అన్న ప్రకటనలకే జెఎసీ పరిమితమైనట్లు తెలుస్తోంది.

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!