Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

‘జబర్దస్త్’లో మొదలైన లొల్లి.. ఇకపై బాధ్యత అంతా మెగా బ్రదర్ చేతుల్లోకి!

Jabardasth Show Now taken Over By Nagababu, ‘జబర్దస్త్’లో మొదలైన లొల్లి.. ఇకపై బాధ్యత అంతా మెగా బ్రదర్ చేతుల్లోకి!

బుల్లితెరలో వస్తున్న ‘జబర్దస్త్’షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం, శుక్రవారం ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతారు. అంతేకాక జబర్దస్త్ రేటింగ్స్ కూడా అమోఘంగా ఉంటాయి. ఈ షోకు ఇంతటి పాపులారిటీ రావడంతో తెర ముందు నాగబాబు, రోజాతో పాటు కంటెస్టెంట్ల కామెడీ ఎంత ముఖ్యమో.. తెర వెనుక దర్శద్వయం నితిన్-భరత్‌లు కూడా అంటే ముఖ్యం. ఇప్పటివరకు క్రియేటివ్ హెడ్స్‌గా వ్యవహరిస్తున్న వీరు షో నుంచి బయటికి వచ్చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సుడిగాలి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ‘పోవే పోరా’ షో విషయంలో వీరికి, మల్లెమాల ప్రొడక్షన్స్ మధ్య ఏవో మనస్పర్థలు చోటు చేసుకున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో వారిద్దరూ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని గ్రహించిన షో నిర్వాహకులు మెగా బ్రదర్ నాగబాబుకు ‘జబర్దస్త్’ పూర్తి బాధ్యతలను అప్పగించారట. గతంలో సీరియల్స్ రాసిన అనుభవం కలిగిన నాగబాబు.. ప్రస్తుతం ఈ షోపై ప్రత్యేక శ్రద్ద వహించారని సమాచారం.

Jabardasth Show Now taken Over By Nagababu, ‘జబర్దస్త్’లో మొదలైన లొల్లి.. ఇకపై బాధ్యత అంతా మెగా బ్రదర్ చేతుల్లోకి!

ఇందులో భాగంగానే లావుగా ఉన్న కొంతమంది కంటెస్టెంట్లను బరువు తగ్గించుకోవాలని సూచించారట. అంతేకాకుండా స్కిట్స్‌లో మరింత పదునుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. నితిన్-భరత్‌లు లేకపోయినా.. షో రేటింగ్స్ పడిపోకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు. చూడాలి మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో?

Related Tags