వైభవంగా ‘డాక్టర్ లాఫ్టర్ అవార్డ్స్ 2020’.. అవార్డులందుకున్న జబర్దస్త్ టీం

తెలుగు ప్రేక్షకులకు తమ నవ్వులు పంచుతోన్న సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్ రాకేష్, ఉదయ శ్రీ, స్వప్న, నాగిరెడ్డి, చంద్రముఖి చంద్రశేఖర్, యాదమ్మ రాజు..

వైభవంగా 'డాక్టర్ లాఫ్టర్ అవార్డ్స్ 2020'.. అవార్డులందుకున్న జబర్దస్త్ టీం
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2020 | 6:12 PM

నవ్వుల్ని నలుగురికి పంచేవారు కూడా డాక్టర్లే అనే నినాదాన్ని పురస్కరించుకొని విక్రమ్ ఆర్ట్స్ విక్రమ్ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘నేచర్ కేర్ ఇన్నోవెర్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (NCIS) శ్రీ బెల్లం విజయ కుమార్ రెడ్డి గారు సమర్పించిన ‘డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ 2020’ మహోత్సవం ఫిబ్రవరి 29న రాడిషన్ బ్లూ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. శ్రీ రసమయి బాలకిషన్ గారు హాజరై, తమ పాటలతో ఉర్రూతలూగించారు.

తెలుగు ప్రేక్షకులకు తమ నవ్వులు పంచుతోన్న సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్ రాకేష్, ఉదయ శ్రీ, స్వప్న, నాగిరెడ్డి, చంద్రముఖి చంద్రశేఖర్, యాదమ్మ రాజు, జీవన్, సూర్య తేజు, సుబ్రాన్త్‌లను ఘనంగా సన్మానించి ‘డాక్టర్ లాఫ్టర్ అవార్డ్’తో సత్కరించారు. అయితే ఈ అవార్డులందుకున్నవారిలో ఎక్కువగా జబర్దస్త్ టీమ్ కమెడియన్స్ ఉండటం విశేషం.