Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

లైవ్​లో వెక్కి..వెక్కి ఏడ్చిన‌ రష్మి.. రీజ‌న్ ఏంటంటే..?

Jabardasth anchor Rashmi Gautam emotional request to fans, లైవ్​లో వెక్కి..వెక్కి ఏడ్చిన‌ రష్మి.. రీజ‌న్ ఏంటంటే..?

కరోనా వైరస్ కార‌ణంగా దేశ‌మంతా లాక్‌డౌన్‌ విధించిన నేప‌థ్యంలో మనుషులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలిసిందే. ఇక మూగజీవాల పరిస్థితి అయితే చెప్ప‌క్క‌ర్లేదు. అవి ఫేస్ చేస్తోన్న ఇబ్బందుల‌ను త‌ల‌చుకోని ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టి రష్మీ గౌతమ్‌ కన్నీరు పెట్టుకుంది. ఫుడ్ దొరక్క వందల సంఖ్య‌లో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని పేర్కొంది. ఈ విషయంపై ఆమె సోషల్​ మీడియాలో మాట్లాడుతూ లైవ్‌లో ఎమోష‌న‌ల్ అయ్యి కంట‌త‌డి పెట్టుకుంది.

డైలీ లేబ‌ర్, నిరుపేదలు తీవ్ర‌ ఇబ్బందులు పడుతున్నారని.. చాలామందికి టైంకి తిండి దొర‌క‌డం లేద‌ని ఆవేదన వ్యక్తం చేసింది. వీధి కుక్కలు, ఆవులు కూడా ఆహారం దొర‌క్క అల‌మ‌టిస్తున్నాయ‌ని తెలిపింది. ప్ర‌జ‌లంతా మానవతా దృక్పథంతో ప్రజలంతా వీధి శునకాలు, ఇతర జీవాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌కు ఆర్థిక సాయం చేస్తున్న‌ట్టుగానే, మూగ‌జీవాల కోసం ప‌నిచేస్తోన్న సంస్థ‌ల‌కు కూడా ఎంతోకొంత సాయం చేయాల‌ని ర‌ష్మి పేర్కొంది.

Related Tags