Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

బాలయ్యతో రష్మీ..కాంబినేషన్ అదుర్స్

Rashmi To Romance With Balayya, బాలయ్యతో రష్మీ..కాంబినేషన్ అదుర్స్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 8న రీలీజై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మూవీని డిసెంబర్ 20 న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా బాలయ్య-బోయపాటి ఇటీవల తమ కాంబోలో మూడో మూవీని లాంఛనంగా స్టార్ట్ చేశారు.  గతంలో  వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ లాంటి బ్లాక్ బాస్టర్ బొమ్మలను అందించారు. త్వరలోనే వీరి తాజా మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.

మరోసారి నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా ఉండబోతుందని బోయపాటి ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. అసలు బాలయ్య వెయిట్ తగ్గింది కూడా ఈ మూవీ కోసమేనట. అయితే ఈ చిత్రం లేటెస్ట్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ కనిపించనున్నారని టాక్. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం..బోయపాటి రష్మీని అప్రోచ్ అయ్యారట. దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ‘గుంటూర్ టాకీస్’ తర్వాత రష్మీకి చెప్పుకోదగ్గ పాత్రలేమీ రాలేదు. లేట్ అయినా కానీ అగ్ర కథానాయకుడి సరసన ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.