కరోనా కట్టడిలో.. జబల్‌పూర్ టాప్..

ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. దీని నివారణకు విరుగుడుగా లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటికే ప్రపంచంలోని సగం పైగా

కరోనా కట్టడిలో.. జబల్‌పూర్ టాప్..
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 6:55 PM

ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. దీని నివారణకు విరుగుడుగా లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటికే ప్రపంచంలోని సగం పైగా ప్రజలు వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేసిన జబల్పూర్‌లో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో యావత్‌ దేశం దృష్టి జబల్పూర్‌పై పడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ పారిశ్రామికంగా పెద్దనగరం. నగరంలో దాదాపు 20 లక్షల జనాభా ఉంది.

కోవిద్ 19 ఇప్పుడు దేశమంతా విస్తరిస్తోంది. దుబాయ్‌ నుంచి నగరానికి తిరిగి వచ్చిన వ్యాపారి కుటుంబానికి చెందిన ముగ్గురు, జర్మనీ నుంచి విద్యార్థికి మార్చి 20న కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో నగరంలో తొలిసారిగా నలుగురికి వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ నలుగురూ విదేశాల నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. మార్చి 21న నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. ఈ నలుగురూ ఎవరెవర్ని కలుసుకున్నారో తెలుసుకొని వారికి పరీక్షలు నిర్వహించారు. వీరందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రి క్వారంటైన్‌కు తరలించారు.

కాగా.. కరోనా కట్టడి కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌, ఎస్పీలు లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేసేందుకు వివిధ విధానాలను అమలుచేశారు. పోలీసులు నగర సరిహద్దులను మూసివేశారు. నిత్యావసరాలు కొనుగోలుకు మాత్రం ప్రజలను తక్కువ సంఖ్యలో అనుమతించారు. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నగరంలో గత 12 రోజులుగా కొత్త కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని అధికార యంత్రాంగం తెలిపింది.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.