Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

ఫేస్‌బుక్ మార్చిన రెండు జీవితాల కథ.. ఎవరిది తప్పు.?

Jab V Net A Cyber Crime Episode On TV9, ఫేస్‌బుక్ మార్చిన రెండు జీవితాల కథ.. ఎవరిది తప్పు.?

ప్రియ.. వయసు 22 సంవత్సరాలు.. అందం.. అభినయం రెండు జత కలిసి ఈ అమ్మాయికి తెలిసినవి రెండే. ఒకటి బాయ్‌ఫ్రెండ్ రోహిత్.. రెండోది ఇంటర్నెట్. తన జీవితం, తన లోకంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. రోహిత్ ఏమి అనుకుంటున్నాడో.. తన ఆలోచనలు ఏంటో తెలుసుకోకుండా ఎక్కువ సార్లు విసిగిస్తూ ఉంటుంది ప్రియ. అతడి అభిరుచుల గురించి పట్టించుకోకుండా రోహిత్‌తోనే గడపాలని అనుకుంటుంది. కానీ రోహిత్‌కు మాత్రం అది నచ్చదు. తన లైఫ్‌లోకి ప్రియ రావడం శాపంలా భావిస్తాడు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే ప్రియ 25 రోజులు బయట ఊరికి వెళ్లాల్సి వస్తుంది.

ఆ సమయంలో రోహిత్ సంతోషానికి అవధులు ఉండవు. ప్రియ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తాడు. అప్పుడే అతనికి శాంతి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ బంధం కాస్తా మరింత దగ్గరవుతుంది. ఇక కొద్దిరోజులకు ప్రియ ఊరి నుంచి వచ్చి.. రోహిత్ గురించి ఎంక్వయిరీ చేస్తుంది. ఫోన్ నెంబర్ మార్చేశాడని తెలుస్తుంది. అటు రోహిత్‌కు కూడా ప్రియ వచ్చినట్లు తెలుస్తుంది. దానితో తన కొత్త లవర్‌ ఫోటోను పంపిస్తాడు.

ప్రియ కోపంతో తనకు తెలిసిన ఇంటర్నెట్‌ను నమ్ముతుంది. రోహిత్ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ తెలియడంతో శాంతి, రోహిత్‌ల పర్సనల్ ఫోటోలను ప్రపంచం మొత్తం చూసేలా షేర్ చేస్తుంది. దీనితో శాంతి రోహిత్ మీద పోలీస్ కేసు పెట్టి జైలు పాలు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మీరే చూడండి.

Related Tags