బాబు మీ నాన్న లేడురా! పోలీసు కంట కన్నీరు

శ్రీనగర్‌: పోలీస్ ఉద్యోగం అంటే మాములు విషయం కాదు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఒక్కసారి కాఖీ చొక్కా వేశామంటే రాగద్వేషాలు వదిలి సమాజ సేవకుడిగా మారాల్సిందే.  విధి నిర్వహణ కోసం కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండాలి. సెలవలు ఉండదు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వెన్ను చూపకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. తాజాగా ఉగ్రవాదుల మారణకాండలో ఓ పోలీసు అధికారి అశువులు బాశాడు. వివరాల్లోకి వెళితే.. జమ్ముకశ్మీర్‌లో జూన్‌ […]

బాబు మీ నాన్న లేడురా! పోలీసు కంట కన్నీరు
Follow us

|

Updated on: Jun 18, 2019 | 2:58 PM

శ్రీనగర్‌: పోలీస్ ఉద్యోగం అంటే మాములు విషయం కాదు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఒక్కసారి కాఖీ చొక్కా వేశామంటే రాగద్వేషాలు వదిలి సమాజ సేవకుడిగా మారాల్సిందే.  విధి నిర్వహణ కోసం కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండాలి. సెలవలు ఉండదు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వెన్ను చూపకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. తాజాగా ఉగ్రవాదుల మారణకాండలో ఓ పోలీసు అధికారి అశువులు బాశాడు.

వివరాల్లోకి వెళితే.. జమ్ముకశ్మీర్‌లో జూన్‌ 12న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో అనంతనాగ్‌లోని సర్దార్‌ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అర్షద్‌ ఖాన్‌ ఒకరు. తీవ్ర గాయాలపాలైన అర్షద్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. ఆదివారం మరణించారు.

అయితే  తన తండ్రి వీరమరణం పొందాడని తెలసుకోలేని ఓ చిన్నారిని ఎత్తుకొని కన్నీటిపర్యంతమైన మరో పోలీసు ఉన్నతాధికారి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి మనసులను కదిలిస్తోంది.

అర్షద్ ఖాన్ మృతదేహానికి  అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పిస్తున్న సమయంలో  అక్కడే ఉన్న ఆయన నాలుగేళ్ల కుమారుణ్ని ఎత్తుకొని పోలీసు ఉన్నతాధికారి హసీబ్‌ మొఘల్‌ నివాళి అర్పింపజేశారు. ఈ క్రమంలో ఆ చిన్నారిని చూసి ఉద్వేగం ఆపుకోలేక పోయిన హసీబ్‌ అతణ్ని పక్కకు తీసుకెళుతూ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మనసుల్ని హత్తుకుంటుంది.