జ్యోతికుమారికి ఇవాంకా ప్రశంస.. ఇండియాలో విమర్శల వెల్లువ

లాక్ డౌన్ కారణంగా తన తండ్రి మోహన్ ని సైకిలుపై వెనక కూర్చోబెట్టుకుని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ నుంచి బీహార్ జిల్లాలోని దర్బంగా జిల్లా వరకు 1200 కి.మీ. దూరం తొక్కుకుంటూ వెళ్లిన 15 ఏళ్ళ జ్యోతికుమారి పట్ల ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఆమె తాలూకు వీడియోలను చూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ చలించిపోయి ట్వీట్లు చేశారు.  15 సంవత్సరాల  జ్యోతికుమారి గాయపడిన తన తండ్రిని సొంత గ్రామానికి సైకిలుపై కూచోబెట్టుకుని […]

జ్యోతికుమారికి ఇవాంకా ప్రశంస.. ఇండియాలో విమర్శల వెల్లువ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 25, 2020 | 7:25 PM

లాక్ డౌన్ కారణంగా తన తండ్రి మోహన్ ని సైకిలుపై వెనక కూర్చోబెట్టుకుని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ నుంచి బీహార్ జిల్లాలోని దర్బంగా జిల్లా వరకు 1200 కి.మీ. దూరం తొక్కుకుంటూ వెళ్లిన 15 ఏళ్ళ జ్యోతికుమారి పట్ల ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఆమె తాలూకు వీడియోలను చూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ చలించిపోయి ట్వీట్లు చేశారు.  15 సంవత్సరాల  జ్యోతికుమారి గాయపడిన తన తండ్రిని సొంత గ్రామానికి సైకిలుపై కూచోబెట్టుకుని పన్నెండు వందల కిలో మీటర్ల దూరం నడిపింది.  భారత ప్రజల ప్రేమాభిమానాలను, సైక్లింగ్ ఫెడరేషన్ ఇమేజీని ఈ బ్యూటిఫుల్ ఫీట్ చూపుతోంది అని ఆమె పేర్కొంది. ఈ ట్వీట్ చూసిన భారత సైక్లింగ్ ఫెడరేషన్..ఇంప్రెస్ అయి.. ట్రయల్స్ కు రావలసిందిగా ఆమెను ఆహ్వానించింది.

అయితే… భారత దేశంలో లాక్ డౌన్ కారణంగా స్తంభించిన రవాణా రంగాన్ని, ఒక అమ్మాయి పేదరికాన్ని ప్రపంచానికి చాటడమేనా ఇవాంకా ట్వీట్ లోని ఉద్దేశమంటూ అనేకమంది ఆమెను దుమ్మెత్తిపోశారు. జ్యోతికుమారి పేదరికాన్ని, ఆమె నిర్భాగ్య స్థితిని ఓ థ్రిల్ గా చూపడానికి ప్రయత్నిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ప్రభుత్వం జ్యోతికుమారిని ఆదుకోలేకపోగా.. ఇదేదో ఓ అచీవ్ మెంట్ (ఘన విజయం) గా   ‘ట్రంపెట్’ బజాయిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కూడా.. ఇది ఎక్స లెన్స్ ఫీట్ కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగా ఆ పేద అమ్మాయికి కలిగిన దుర్భర స్థితి అని అన్నారు.