డోనాల్డ్‌ డక్‌తో డాగ్‌ దోస్తీ..

its viral dog meets donald duck, డోనాల్డ్‌ డక్‌తో డాగ్‌ దోస్తీ..

మూగజీవాలది కల్మషం లేని ప్రేమ. మనుషుల్లో అది చాలా తక్కువగా కనిపించే లక్షణమే అని చెప్పుకోవచ్చు. మన అవసరాల కోసం జంతువులను మచ్చిక చేసుకుంటాం. దానికి స్నేహం, ప్రేమ వంటి పేర్లను నిర్వచించలేం. కానీ, ఇక్కడ మాత్రం ఒక డోనాల్డ్‌ డక్, కుక్క మధ్య అనురాగం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. విశ్వాసానికి మారుపేరుగా చెప్పుకునే శునకం.. డోనాల్డ్‌ డక్‌ను ఎంతగానో విశ్వసిస్తూ..దాని ఒడిలో హాయిగా సేదతీరుతోంది. డిస్నీ వరల్డ్‌లో చోటు చేసుకున్నఈ  అపురూప దృశ్యాలను అక్కడి స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సెప్టెంబర్‌ 20న షేర్‌ చేయబడిన ఈ వీడియోకు దాదాపు 7 మిలియన్‌కు పైగా ప్రేక్షకులు వీక్షించారు. 6 లక్షలకు పైగా లైకులు, దాదాపు 2 లక్షల వరకు రీట్విట్‌లతో డోనాల్డ్‌ డక్‌, డాగ్‌ల ఫ్రెండిష్‌ వీడియో వైరల్‌ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *