పురుష క్రికెటర్లతో మమ్మల్ని పోల్చకండి…

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు అంటేనే.. ఠక్కున గుర్తొచ్చేది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఈ బోర్డుకు వచ్చే ఆదాయంలో అధిక భాగం పురుషుల క్రికెట్‌ నుంచే వస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే బోర్డు క్రికెటర్లకు ప్రతీ ఏటా కోట్ల రూపాయల కాంట్రాక్టులతో పాటు తాయిలాలను కూడా ఇస్తూ ఉంటుంది. అయితే పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు పారితోషికాలనుఇవ్వట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా ఈ వివాదంపై భారత స్టార్ మహిళా […]

పురుష క్రికెటర్లతో మమ్మల్ని పోల్చకండి...
Follow us

|

Updated on: Jan 25, 2020 | 11:36 AM

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు అంటేనే.. ఠక్కున గుర్తొచ్చేది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఈ బోర్డుకు వచ్చే ఆదాయంలో అధిక భాగం పురుషుల క్రికెట్‌ నుంచే వస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే బోర్డు క్రికెటర్లకు ప్రతీ ఏటా కోట్ల రూపాయల కాంట్రాక్టులతో పాటు తాయిలాలను కూడా ఇస్తూ ఉంటుంది. అయితే పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు పారితోషికాలనుఇవ్వట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఇక తాజాగా ఈ వివాదంపై భారత స్టార్ మహిళా క్రికెట్ స్మృతి మందానా స్పందించారు. ‘వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘పురుషులతో పోల్చితే తమకు పారితోషికాలు తక్కువగానే లభిస్తున్నాయి. ఇక అందులో తమకు ఎలాంటి బాధా లేదని స్పష్టం చేశారు.

పురుషుల క్రికెట్ నుంచి వచ్చే ఆదాయంతోనే తమకు జీతాలు ఇస్తున్నారు. ఇది అందరూ గుర్తించుకోవాలి. అంతేకాకుండా మహిళా క్రికెట్ ద్వారా ఆదాయం ఎప్పుడైతే రావడం మొదలవుతుందో.. అప్పుడు తానే దగ్గరుండి పురుషులతో పాటుగా తమకు కూడా సమాన జీతాలు ఇవ్వాలని పోరాడతానని స్మృతి మందానా వెల్లడించింది.