ఇట్స్ కరోనా టైమ్.. కానీ 30,000 మంది ప్రేక్షకులుతో ఫుట్‌బాల్‌ మ్యాచ్..!

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని చిన్న దేశం వియత్నాం విజయవంతంగా ఎదుర్కుంది. దీనితో తాజాగా శుక్రవారం నామ్ దిన్హ్‌లోని స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఏకంగా 30,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు...

ఇట్స్ కరోనా టైమ్.. కానీ 30,000 మంది ప్రేక్షకులుతో ఫుట్‌బాల్‌ మ్యాచ్..!
Follow us

|

Updated on: Jun 06, 2020 | 12:04 PM

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని చిన్న దేశం వియత్నాం విజయవంతంగా ఎదుర్కుంది. ఆ దేశంలో కేవలం 328 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. దీనితో మళ్లీ తిరిగి ఆర్ధిక వ్యవస్థను ట్రాక్‌లో పెట్టేందుకు ఈ కమ్యూనిస్ట్ దేశం తిరిగి అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ లీగ్‌ను ప్రారంభించింది. ఇంకేముంది అక్కడున్న ప్రజలు సామాజిక దూరాన్ని సైతం పాటించకుండా వేలల్లో మ్యాచ్‌కు హాజరయ్యారు.

తాజాగా శుక్రవారం నామ్ దిన్హ్‌లోని స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఏకంగా 30,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇక వచ్చిన వారందరికీ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించగా.. అందరికీ అందుబాటులో హ్యాండ్ శానిటైజర్లను కూడా ఉంచారు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన వారెవ్వరూ కూడా మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి నియమాలను మాత్రం పట్టించుకోలేదు. కాగా, స్పెయిన్, ఇంగ్లాండ్, ఇటలీలోని లీగ్‌లు ఈ నెలాఖరులో తిరిగి ప్రారంభం కానున్నాయి.

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..