సరిహద్దుల్లో 47 కొత్త ఔట్ పోస్టులు, ఐటీబీపీ నిర్ణయం

లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఉద్రిక్తతలు పెంచుతున్న నేపథ్యంలో ఇండో-చైనా సరిహద్దుల్లో కొత్తగా 47 ఔట్ పోస్టులను  ఏర్పాటు చేయాలని  ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు విభాగం నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. గ్రేటర్ నోయిడాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి.. 3,488 కి.మీ. పొడవునా ఉన్న బోర్డర్ ను రక్షించే కీలక బాధ్యత ఈ విభాగంపై ఉందన్నారు. దీనికి 7,223 కోట్ల బడ్జెట్ ను […]

  • Umakanth Rao
  • Publish Date - 10:08 pm, Sat, 24 October 20

లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఉద్రిక్తతలు పెంచుతున్న నేపథ్యంలో ఇండో-చైనా సరిహద్దుల్లో కొత్తగా 47 ఔట్ పోస్టులను  ఏర్పాటు చేయాలని  ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు విభాగం నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. గ్రేటర్ నోయిడాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి.. 3,488 కి.మీ. పొడవునా ఉన్న బోర్డర్ ను రక్షించే కీలక బాధ్యత ఈ విభాగంపై ఉందన్నారు. దీనికి 7,223 కోట్ల బడ్జెట్ ను కేటాయించామని, పైగా 28 రకాల కొత్త వాహనాలను ప్రభుత్వం సమకూర్చిందని ఆయన చెప్పారు.  ఈ వేర్వేరు రకాల అధునాతన వాహనాలతో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగం మరింత బలోపేతమవుతుందన్నారు.