అక్క‌డ స్థిరంగా కరోనా కేసులు- ఒకింత నెమ్మదించిన ఉధృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ వైరస్‌కు బలైనవారి సంఖ్య 2 లక్షలు దాటింది. బాధితుల సంఖ్య కూడా 30 లక్షల‌కు చేరువైంది.

అక్క‌డ  స్థిరంగా కరోనా కేసులు- ఒకింత నెమ్మదించిన ఉధృతి
Follow us

|

Updated on: Apr 26, 2020 | 2:50 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ వైరస్‌కు బలైనవారి  సంఖ్య 2 లక్షలు దాటింది. బాధితుల సంఖ్య కూడా 30 లక్షల‌కు చేరువైంది. బాధితులు, మరణాల్లో అత్యధికంగా అమెరికా, ఐరోపా దేశాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఇక, కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే నమోదయినట్టు జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ విశ్లేషించింది. స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, టర్కీల్లో మొత్తం కేసుల కంటే అగ్రరాజ్యంలోనే ఎక్కువ మంది వైరస్ బారినపడటం గమనార్హం. ఇక ఇట‌లీలో క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడిప్పుడే కాస్తా శాంతిస్తోంది.

మొన్న‌టి వ‌ర‌కు ఇట‌లీలో క‌రోనా మృత్యుఘోశ వినిపించింది. ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు వైర‌స్ బారిన ప‌డ‌గా,  రోజుకు వంద‌లు, వేల‌ సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. క‌రోనా ధాటికి అల్లాడిపోయిన ఇట‌లీలో ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి ఒకింత నెమ్మదించినట్లుగా కనిపిస్తున్నది. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరగడం లేదు. ఆదివారం (ఏప్రిల్ 26) ఉదయానికి ఇటలీలో కరోకా పాజిటివ్ కేసుల సంఖ్య 1, 95, 351కి చేరుకుంది. 26 384 మంది మరణించారు. కరోనా సోకి చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య 63, 120 కాగా,  యాక్టివ్ కేసుల సంఖ్య 1.05, 847. వీరిలో 2, 102 మంది పరిస్థితి విషమంగా  ఉన్న‌ట్లు ఇట‌లీ ప్ర‌భుత్వం తెలిపింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..