ఇటలీ ప్రధాని భద్రతాధికారిని కాటేసిన కరోనా మహమ్మారి..!

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ప్రంపచ దేశాలన్నింటిని ముట్టేసింది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్, అమెరికాలో అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. ఇటలీ ప్రధాని గియుసేప్‌ కాంటే భద్రతాధికారుల్లో ఒకరైన జార్జియో గుస్టామాచియా .. కరోనా దెబ్బకు ప్రాణాలు విడిచారు. ఆయన వయస్సు.. 52 ఏళ్లు. గత మార్చి 21వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఆయన్ను.. […]

ఇటలీ ప్రధాని భద్రతాధికారిని కాటేసిన కరోనా మహమ్మారి..!
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 9:00 PM

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ప్రంపచ దేశాలన్నింటిని ముట్టేసింది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్, అమెరికాలో అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. ఇటలీ ప్రధాని గియుసేప్‌ కాంటే భద్రతాధికారుల్లో ఒకరైన జార్జియో గుస్టామాచియా .. కరోనా దెబ్బకు ప్రాణాలు విడిచారు. ఆయన వయస్సు.. 52 ఏళ్లు. గత మార్చి 21వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఆయన్ను.. ప్రధాని భద్రతా విభాగానికి సంబంధించిన విధుల నుంచి తప్పించి.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. శనివారం ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. గుస్టామాచియా గత రెండు వారాలుగా బ్రిటన్ ప్రధానికి దూరంగా ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. గత నెలలో గుస్టామాచియాకు పాజిటివ్ అని తేలడంతోనే.. వెంటనే ముందస్తు జాగ్రత్తగా ప్రధాని కాంటేకి కరోనా పరీక్షలు జరిపారు. ఈ టెస్టుల్లో ఆయనకు నెగిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు.