అవి ఎలుగు పాదముద్రలే..యతి కాదంటున్న నేపాల్ ఆర్మీ

ఢిల్లీ: పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి భారత ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని వెల్లడించింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ప్రాంతంలో ఎలుగుబంట్లు తరచూ సంచరిస్తుంటాయని తెలిపింది. హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్‌ 9న మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో భారీ పాద ముద్రికలను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్చితంగా ‘యతి’వే […]

అవి ఎలుగు పాదముద్రలే..యతి కాదంటున్న నేపాల్ ఆర్మీ
Follow us

|

Updated on: May 03, 2019 | 12:25 PM

ఢిల్లీ: పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి భారత ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని వెల్లడించింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ప్రాంతంలో ఎలుగుబంట్లు తరచూ సంచరిస్తుంటాయని తెలిపింది. హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్‌ 9న మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో భారీ పాద ముద్రికలను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్చితంగా ‘యతి’వే అయి ఉంటాయని ఆర్మీ ట్విటర్‌లో పేర్కొంది. గతంలోనూ మకలు-బరున్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో యతి అడుగులు కన్పించినట్లు సైన్యం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆర్మీ ట్విటర్‌లో పోస్టు చేసింది. అయితే నేపాల్ ఆర్మీ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ పాదముద్రలను భారత్ ఆర్మీ గుర్తించిన సమయంలో నేపాల్ ఆర్మీకి చెందిన లియైజన్‌ బృందం కూడా ఉందని బ్రిగేడియర్‌ జనరల్ విజ్ఞాన్‌ దేవ్ పాండే మీడియాకు వెల్లడించారు. ‘స్థానికులు, పోర్టర్లు వెల్లడించిన ప్రకారం అవి ఎలుగుబంటి పాద ముద్రలు. అవి ఆ ప్రాంతంలో తరచూ కనిపిస్తాయి’ అని ఆయన తెలిపారు.