జడేజా… ది గేమ్ ఛేంజర్!

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు బర్మింగ్‌హామ్ వేదికగా భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. ఇది ఇలా ఉండగా భారత్‌కు మొదటి వికెట్ దక్కడంతో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా‌పై ట్విట్టర్ ద్వారా మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 23వ ఓవర్‌లో జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టి జాసన్ రాయ్ రూపంలో భారత్‌కు మొదటి వికెట్ దక్కడంలో జడేజా కీ-రోల్ […]

జడేజా... ది గేమ్ ఛేంజర్!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 30, 2019 | 10:05 PM

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు బర్మింగ్‌హామ్ వేదికగా భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. ఇది ఇలా ఉండగా భారత్‌కు మొదటి వికెట్ దక్కడంతో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా‌పై ట్విట్టర్ ద్వారా మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

23వ ఓవర్‌లో జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టి జాసన్ రాయ్ రూపంలో భారత్‌కు మొదటి వికెట్ దక్కడంలో జడేజా కీ-రోల్ పోషించాడు. ఇక ఆ క్యాచ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జడేజా మాత్రమే ఈ క్యాచ్‌ను పట్టగలడంటూ కామెంటేటర్ కితాబు ఇవ్వగా.. ‘టాప్ టాప్ క్యాచ్.. గేమ్ ఛేంజర్’ అంటూ సురేష్ రైనా ట్వీట్ చేశాడు. ఇక అద్భుతమైన క్యాచ్ అంటూ మహ్మద్ కైఫ్ కూడా ప్రశంసించాడు. అటు అభిమానులు కూడా ‘సర్ జడేజా’ను ప్రశంసలతో ముంచెత్తారు.