Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

కల్కి భగవాన్ ఇంతకీ ఎక్కుడున్నట్టు?

IT seizes Rs 33 cr from premises of godman Kalki Bhagwan and son, కల్కి భగవాన్ ఇంతకీ  ఎక్కుడున్నట్టు?

వివాదాస్పద కల్కిభగవాన్ ఆశ్రమంపై దాడులు జరిపిన ఐటీ శాఖ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా భారీగా నగదు, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిన దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను కూడా అధికారులు గుర్తించారు. భక్తి ముసుగులో కల్కిభగవాన్ సాగించిన వ్యవహారాలపై తాజాగా చర్చ మొదలైంది. అయితే గత కొంత కాలంగా కల్కిభగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ నాయడు, ఆయన భార్య అమ్మా భగవాన్ అలియాస్ పద్మావతి కనిపించడం లేదు. వీరి అదృశ్యంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు రోజులుగా ఐటీ అధికారులు వరదయ్యపాళెం సహా పలు ఆశ్రమాల్లో ఏకకాలంలో దాడులు చేసి పెద్ద ఎత్తున స్వదేశీ, విదేశీ కరెన్సీ , నగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయిదు కోట్లు విలువ చేసే వజ్రాలు, రూ.26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, రూ.40,.39 కోట్ల నగదుతో పాటు రూ.18 కోట్ల విదేశీ కరెన్సీ, మొత్తం రూ.93 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కల్కిభగవాన్ కుమారుడు కృష్ణ, ఆయన భార్య ప్రీతిలను చెన్నైకి తరలించి విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్న కల్కిభగవాన్, ఆయన సతీమణి పద్మావతిల జాడ కనిపించలేదు. ఇంతకీ వీరు ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే కల్కి భక్తుల్లో విదేశీ భక్తుల కూడా ఉన్నారు. వీరిలో కొంతమంది మహిళలు అదృశ్యం కావడంపై ఆరోపణలున్నాయి. కల్కిభగవాన్‌కు ఏకంగా స్విస్ బ్యాంకులో అకౌంట్ కూడా ఉందిని అందులో వేలకోట్ల రూపాయలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో భూములు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు కూడా ఉన్నట్టుగా సమాచారం. అయితే ఇవన్నీ వీరిపేరున కాకుండా పలువురు బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణాజీ బెంగళూరులో రూ.1000 కోట్ల పెట్టుబడితో రియల్‌ఎస్టేట్‌ కంపెనీ, లాస్‌ఏంజెల్స్‌లో మరో కంపెనీలు నడుపుతున్న నేపథ్యంలో 400 మంది ఐటీ అధికారులు ఏకకాలంలో 40 కల్కి కేంద్రాలపై బుధవారం నుంచి మెరుపుదాడులు జరిపారు.