ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పొడిగింపు

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ గడువు మరో రెండు నెలలు పొడిగించింది.

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పొడిగింపు
Follow us

|

Updated on: Oct 01, 2020 | 1:14 PM

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ గడువు మరో రెండు నెలలు పొడిగించింది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి నవబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు బుధవారం ఒక ట్వీట్‌ చేసింది. నిజానికి ఈ గడువు సెప్టెంబర్‌ 30తో ముగిసిపోయింది. గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. అదే సమయంలో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకూ గడువు పెంచింది.

కోవిడ్‌-19 నేపథ్యంలో రిటర్న్స్‌ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2019–20 అవుతుంది. అంటే 2020 మార్చినాటికి 2018–19 ఐటీఆర్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, కరోనా విసృంభణ కారణంగా దీనిని తొలుత జూన్‌ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మళ్లీ జూలై 31 వరకూ పెంచింది. జూలై నుంచి సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువలు కలిగిన లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ, కొందరికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సమాచారం కూడా అందించింది. అలాగే, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పొడిగిస్తూ ఈ-మెయిల్‌ను పంపుతోంది.

మరోవైపు, 2018-19 వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వార్షిక రిటర్న్స్, ఆడిట్‌ రిపోర్ట్‌ దాఖలుకు (జీఎస్‌టీఆర్‌-9, జీఎస్‌టీఆర్‌ 9సీ) గడువును మరోనెల అంటే అక్టోబర్‌ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సీబీఐసీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్డ్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌) మరో ట్వీట్‌లో ప్రకటించింది. మేలో ఈ గడువును సీబీఐసీ మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్‌ వరకూ పొడిగించింది.

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా