Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

కల్కి భగవాన్ ఆశ్రమం చుట్టూ పోలీసులు.. ఎందుకో తెలుసా?

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న కల్కిభగవాన్ ఆశ్రమంలో తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కల్కి భగవాన్ కార్యాలయాల్లో 40 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బత్తులవల్లంలో ఉన్న ఏకం గోల్డెన్ సిటీ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీతో పాటు, సీఈవో లోకేష్ దాసోజీని సైతం ఐటీ అధికారులు విచారిస్తున్నారు.

కల్కి భగవాన్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. వీరి నుంచి సేకరించిన విరాళాలపై ఆరోపణలున్నాయి. భక్తుల నుంచి సేకరించినర సొమ్ముతో భారీగా స్థిరాస్తులు, డిపాజిట్లు చేసినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అదే విధంగా ఆశ్రమాలకు వస్తున్న విరాళాలకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపులో తేడాలున్నట్టు కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. సోదాల నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.