బాగా ఆడారు.. కప్ తెండి..కీప్ ఇట్ అప్

ICC world Cup 2019, బాగా ఆడారు.. కప్ తెండి..కీప్ ఇట్ అప్

వరల్డ్ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. బౌలర్లు, బాట్స్‌మన్ ఉమ్మడి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు చాహల్ స్పిన్‌కు విలవిల్లాడింది. కేవలం 227 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఆ జట్టులో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కును దాటకపోవడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత బ్యాట్స్‌మెన్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్ శిఖర్ ధవన్ నిరాశపరిచినా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో దుమ్ము లేపాడు. 144 బంతుల్లో 122* (13 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ 18, లోకేశ్ రాహుల్ 26, ధోని 34, హార్దిక్ పాండ్యా 15* పరుగులు చేశారు. అయితే, భారత విజయంపై టీం ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. టీమిండియా బాగా ఆడిందని కొనియాడాడు.

చాహల్, బుమ్రా గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారని ప్రశంసించాడు. ఇక, రోహిత్ శర్మ బ్యాటింగ్ అద్భుతమని, పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడని సచిన్ అన్నాడు. అతడి బ్యాటింగ్ చూడటం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. చివరి వరకు ఇలాగే ఆటను కొనసాగించి కప్ తో తిరిగి రావాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *