సిట్ విచారణకు దిగొచ్చిన ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్

IT Grid, సిట్ విచారణకు దిగొచ్చిన ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్

డేటా చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ ఎట్టకేలకు పోలీసుల ముందుకొచ్చాడు. విచారణకు సిద్దమంటూ మాదాపూర్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. అయితే విచారణలో భాగంగా సిట్ కార్యాలయానికి వెళ్లాలని మాదాపూర్ పోలీసులు సూచించారు. దీంతో కాసేపట్లో గోషామహల్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అశోక్‌కు కొద్ది రోజుల క్రితం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ ప్రజల డేటాను చోరీ చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు నిర్వహించారు. దాడులలో ప్రజలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై క్షుణ్ణంగా విచారణ జరపాలని ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. సిట్ విచారణకు హాజరుకావాలంటూ అశోక్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ అశోక్ విచారణకు హాజరుకాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *