ఐటీ గ్రిడ్స్ సంస్థను సీజ్ చేశారు

, ఐటీ గ్రిడ్స్ సంస్థను సీజ్ చేశారు

హైదరాబాద్: డేటా చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థను తెలంగాణ పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్, మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి సిట్ అధికారులు వెళ్లి సీజ్ చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.

డేటా చోరీ కేసు దర్యాప్తును తెలంగాణ సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో గత రెండు రోజులుగా సిట్ సోదాలు చేసింది. పలు హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ ఉద్యోగులను మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *