Breaking News
  • ఏపీ గవర్నర్‌కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ. లాక్‌డౌన్‌లో అందించే ఆర్థిక సాయాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తోంది. రూ.వెయ్యి, నిత్యావసరాలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. సామాజిక దూరం పాటించకుండా నగదు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు. రూ.వెయ్యి పంపిణీలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారంలా వాడుకుంటున్నారు. చట్టవ్యతిరేకంగా వ్యహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.
  • ప.గో: ద్వారకాతిరుమలలో క్షుద్రపూజల కలకలం. చెరువువీధిలోని ఓ ఇంటి ఎదుట బొమ్మ, పసుపు, కుంకుమ.. ముగ్గు, నిమ్మకాయలతో చేతబడి చేసినట్టు అనుమానం. భయాందోళనలో గ్రామస్తులు.
  • తెలంగాణలో మర్కజ్‌ టెన్షన్‌. నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో.. ఇంకా పాజిటివ్‌ కేసులున్నాయని విచారిస్తున్న అధికారులు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వాళ్లను కలిసిన పలువురిని క్వారంటైన్‌కు తరలింపు. నిన్నటి వరకు మొదటి స్టేజ్‌గా నేరుగా మర్కజ్‌ వెళ్లొచ్చిన వారితో.. సంబంధాలు ఉన్నవారి శాంపిల్స్‌ తీసుకున్న వైద్య సిబ్బంది. ఈ రోజు నుంచి రెండో స్టేజ్‌ విచారణ. నిన్న శాంపిల్స్ తీసుకున్న వారు ఎవరెవరిని కలిశారో పోలీసుల విచారణ.
  • నిజామాబాద్‌: జిల్లాలో మరో కరోనా అనుమానిత వ్యక్తి మృతి. మోపాల్‌ మండలం కంజరలో హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి. గత నెల దుబాయి నుంచి వచ్చిన వ్యక్తి. భయాందోళనలో గ్రామస్తులు.
  • వికారాబాద్‌ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు. మర్కజ్‌ వెళ్లొచ్చిన 18 మందిలో నలుగురికి పాజిటివ్‌. వికారాబాద్‌, మర్పల్లి, పరిగి, తాండూరు వాసులుగా గుర్తింపు. నలుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు. -వికారాబాద్‌ జిల్లా వైద్యాధికారి దశరథ్‌. పరిగిలో హైఅలర్ట్‌ ప్రకటించిన పోలీసులు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిక. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు -పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌.

ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత!

IT companies may shed 30000-40000 mid-level staff, ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత!

ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత నెలకొంది. తగ్గుతున్న కాంట్రాక్టులు, పెరుగుతున్న వ్యయం కారణంగానే కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటోమేషన్‌ రాక కారణంగానూ.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లేఆఫ్స్ ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు పర్‌‌‌‌ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగులను తీసేవారని.. కానీ, ఇప్పుడు తీసేస్తోన్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ ఏడాది 30,000 నుంచి 40,000 మంది మధ్యశ్రేణి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ పరిశ్రమ ప్రముఖులు, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలో మార్పుల పరంగా ప్రతి ఐదేళ్లలో ఒకసారి ఇలాంటివి సాధారణమేనని చెప్పుకొచ్చారు. స్లోడౌన్‌ వంటి ప్రతికూల పరిస్ధితుల్లో కంపెనీలు సహజంగానే అధిక వేతనాలు అందుకునే ఉద్యోగులపైనే తొలుత దృష్టిసారిస్తాయని చెప్పుకొచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అత్యంత సహజంగా ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. మెరుగైన సామర్థ్యం కనబరిచేవరకే ఎవరైనా అధిక వేతనం పొందేందుకు అర్హులని, తీసుకునే వేతనానికి సమాన స్ధాయిలో కంపెనీకి విలువ జోడించాలని పాయ్‌ స్పష్టం చేశారు.

Related Tags