స్పేస్ ఎక్స్, నాసాలకు ‘ఇస్రో’ అభినందనలు

ఇద్దరు వ్యోమగాములతో (మానవ సహిత) అంతరిక్ష యానాన్ని విజయవంతంగా చేపట్టినందుకు స్పేస్ ఎక్స్, నాసాలను ఇస్రో అభినందించింది. తొమ్మిదేళ్ల విరామం తరువాత మొట్టమొదటిసారిగా..

స్పేస్ ఎక్స్, నాసాలకు 'ఇస్రో' అభినందనలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2020 | 5:01 PM

ఇద్దరు వ్యోమగాములతో (మానవ సహిత) అంతరిక్ష యానాన్ని విజయవంతంగా చేపట్టినందుకు స్పేస్ ఎక్స్, నాసాలను ఇస్రో అభినందించింది. తొమ్మిదేళ్ల విరామం తరువాత మొట్టమొదటిసారిగా అమెరికా గడ్డపై నుంచి ఈ మిషన్ చేపట్టి సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసింది. అటు-కమర్షియల్ గా రూపొందించినఅంతరిక్ష  నౌకలో ఏస్ట్రోనట్లు రాబర్ట్ బెక్ హెన్, డో హర్లీ ఇద్దరూ ఆర్బిటరీ ల్యాబ్ లోకి చేరుకున్నారని అంతకుముందు నాసా ట్వీట్ చేసింది. మానవ చరిత్రలో నాసా వ్యోమగాములు ఓ కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం ఇదే తొలిసారని  వివరించింది. అటు-తాము ఈ కేంద్రంలో క్రిస్ ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బెక్ హెన్, హార్లీ పేర్కొన్నారు. మాకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహించగలమన్న విశ్వాసం తమకు ఉందన్నారు.