ఇది మాములు దండయాత్ర కాదు..’ఇస్మార్ట్’ క్లోజింగ్ కలెక్షన్స్!

‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ తో రామ్, పూరీలు బంపర్ హిట్ కొట్టారు. పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మేకింగ్, రామ్ ఇస్మార్ట్ యాక్టింగ్‌తో సినిమా పెద్దపులిలా బాక్సాఫీస్‌పై యుద్దం చేసింది. సరైన బొమ్మ పడితే మాస్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆదరిస్తారో ఈ మూవీ జబర్దస్త్‌గా ఫ్రూవ్ చేసింది.  ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత ట్రేడ్ వర్గాలు షాక్ గురవ్వక తప్పదు. ఫుల్ రన్‌లో’ఇస్మార్ట్ […]

ఇది మాములు దండయాత్ర కాదు..'ఇస్మార్ట్' క్లోజింగ్ కలెక్షన్స్!
iSmart Shankar Closing Collections
Follow us

|

Updated on: Aug 22, 2019 | 9:16 PM

‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ తో రామ్, పూరీలు బంపర్ హిట్ కొట్టారు. పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మేకింగ్, రామ్ ఇస్మార్ట్ యాక్టింగ్‌తో సినిమా పెద్దపులిలా బాక్సాఫీస్‌పై యుద్దం చేసింది. సరైన బొమ్మ పడితే మాస్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆదరిస్తారో ఈ మూవీ జబర్దస్త్‌గా ఫ్రూవ్ చేసింది.  ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత ట్రేడ్ వర్గాలు షాక్ గురవ్వక తప్పదు. ఫుల్ రన్‌లో’ఇస్మార్ట్ శంక‌ర్‌’ 37.50 కోట్లు షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది ఈ చిత్రం.

రామ్ కెరీర్‌లో తొలిసారి వరల్డ్ వైడ్ 75 కోట్ల గ్రాస్ మార్క్‌కి రీచ్ అయిన సినిమా ఇదే. టెంప‌ర్ త‌ర్వాత స‌రైన విజ‌యం లేక చూస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ చిత్రం ఊహించిన దానికంటే మంచి విజయాన్ని అందించింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ ఫుల్ రన్‌లో 37.50 కోట్లు వ‌సూలు చేసిందంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర శంక‌ర్ ర‌చ్చ ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ఒక్క నైజాంలోనే ఈ చిత్రం 16.57 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆంధ్రలో మరో 17 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తంగా ఏపీ తెలంగాణలో 55 కోట్లకు పైగా గ్రాస్.. 34 కోట్ల షేర్ వసూలు చేసింది