ఇస్మార్ట్ సత్తి అదిరిపోయే ఎంట్రీ.. కామెడీ అదుర్స్ గురూ!

వినాయక చవితి సందర్భంగా నవ్వుల నవాబు సత్తి అలియాస్ రవి కుమార్ ‘ఇస్మార్ట్ సత్తి’గా టీవీ9లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ‘ఇస్మార్ట్ న్యూస్’లో ‘ఇస్మార్ట్ సత్తి’గా ప్రేక్షకులను అలరించనున్నారు. అసలు ‘ఇస్మార్ట్ న్యూస్’ అంటే ఏంటి.. ఏం చెబుతారు అనే డౌట్ మీకు ఉండవచ్చు.. అందుకే అదేంటో ఇప్పుడు చూద్దాం. దాపరికం లేని స్వచ్ఛమైన వార్తలతో సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో హాస్యం, ఎత్తిపొడుపు, పరాచకం, పలకరింపులను మేళవించి సగటు ప్రేక్షకుడిని […]

  • Ravi Kiran
  • Publish Date - 4:41 am, Tue, 3 September 19
iSmart News : iSmart Sathi 'King Of Comedy' special - TV9

వినాయక చవితి సందర్భంగా నవ్వుల నవాబు సత్తి అలియాస్ రవి కుమార్ ‘ఇస్మార్ట్ సత్తి’గా టీవీ9లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ‘ఇస్మార్ట్ న్యూస్’లో ‘ఇస్మార్ట్ సత్తి’గా ప్రేక్షకులను అలరించనున్నారు.

అసలు ‘ఇస్మార్ట్ న్యూస్’ అంటే ఏంటి.. ఏం చెబుతారు అనే డౌట్ మీకు ఉండవచ్చు.. అందుకే అదేంటో ఇప్పుడు చూద్దాం. దాపరికం లేని స్వచ్ఛమైన వార్తలతో సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో హాస్యం, ఎత్తిపొడుపు, పరాచకం, పలకరింపులను మేళవించి సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా చేసేదే ఈ ‘ఇస్మార్ట్ న్యూస్’ ముఖ్య ఉద్దేశం. ఇక మన కామెడీ కింగ్ సత్తి ఇవాళ.. డ్యూయల్ రోల్‌లో.. అందమైన పాటతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. మీరు కూడా ఓ లుక్కేయండి.