‘ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి..మీకు సహకరిస్తా’ .. ఢిల్లీ పోలీసులకు మౌలానా సాద్ లేఖ

తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందాల్వీ మొదటి సారి గళం విప్పాడు. తనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి విచారణకు సహకరిస్తానని అంటూ  వారికి ఓ లేఖ రాశాడు. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో తాను వారికి తోడ్పడ్డానని, ఇక మున్ముందు జరిగే విచారణలోనూ సహకరిస్తానని ఈ లేఖలో పేర్కొన్నాడు.

'ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి..మీకు సహకరిస్తా' .. ఢిల్లీ పోలీసులకు మౌలానా సాద్ లేఖ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 18, 2020 | 12:52 PM

తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందాల్వీ మొదటి సారి గళం విప్పాడు. తనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి విచారణకు సహకరిస్తానని అంటూ  వారికి ఓ లేఖ రాశాడు. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో తాను వారికి తోడ్పడ్డానని, ఇక మున్ముందు జరిగే విచారణలోనూ సహకరిస్తానని ఈ లేఖలో పేర్కొన్నాడు. ఈ నెల 1 న, 2 న పోలీసులు జారీ చేసిన రెండు నోటీసులకూ నేను సమాధానమిచ్చానని తెలిపాడు. (అయితే ఈ నోటీసులను ఈయన అసలు ఖాతరు చేయలేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి). కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని, ఎక్కువమంది ఒకే చోట గుమికూడరాదని ప్రభుత్వ ఆంక్షలు ఉన్నప్పటికీ.. వాటిని ధిక్కరించి మౌలానా సాద్ ఈ ప్రార్థనల కోసం నిజాముద్దీన్ మసీదులో పెద్ద సంఖ్యలో గుమికూడాలని తన సహచరులు, మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. గతనెలలో జరిగిన ఈ కార్యక్రమానికి విదేశీయులతో సహా చాలామంది హాజరయ్యారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ జమాత్ ఈవెంటే కారణమని ఆరోపణలు వచ్చాయి. పైగా ఇందులో పాల్గొన్నవారిలో చాలామందికి అప్పటికే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నప్పటికీ.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందింది. మౌలానా సాద్ పై పోలీసులు కొత్తగా 304 సెక్షన్ కూడా పెట్టారు  ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగానికి  సంబంధించినది ఈ సెక్షన్. దీని కింద దోషికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని ప్రకటించుకున్న ఇతనిపై కేంద్ర, రాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున గాలించారు.తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని, తనపై ఎలాంటి ఆరోపణలు మోపారో తాను తెలుసుకోవలసి ఉందని మౌలానా సాద్ ఈ లేఖలో పేర్కొన్నాడు.

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు