Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తూ. గో.జిల్లా కాకినాడ.. కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ప్రకటించిన వీడియో కన్ఫరెన్సింగ్ సొల్యూషన్ ఛాలెంజ్ లో ఎంపికయిన ఆంద్రప్రదేశ్ కు చెందిన వంశీ. ఆదిత్య కాలేజ్ విద్యార్థి వంశీ కురమా కి జాతీయ స్థాయి గుర్తింపు. అమెరికన్ యాప్ జూమ్ అప్ కు ప్రత్యామ్నాయం గా లిబిరో అనే భారతీయ యాప్ ను రూపొందించిన వంశీ.
  • విజయనగరం జిల్లాలో దారుణం. సీతానగరం మండలం నిడగల్లు లో కన్నకూతురు పై తండ్రి అత్యాచారం. గత కొన్నినెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న తండ్రి. తండ్రి ను కాపాడాలని పోలీసులకు వీడియో వాయిస్ పంపిన కూతురు. రంగంలోకి దిగిన పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • హైదరాబాద్ లో మాయమైన సండే సందడి. చాలా ఏరియా లలో కనిపిస్తున్న కర్ఫ్యూ వాతావరణం . షాపులు...మాల్స్ ..రెస్టారెంట్లు..తెరిచి ఉన్నా కన్పిపించని పబ్లిక్. ఆదివారం మార్కెట్ లలో సైతం అనంతం మాత్రం గానే కొనుగోలుదారు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కరోనా భయం. ఇళ్లకే పరిమితం అవుతున్న జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక కేసులతో ... అలర్ట్ అయిన పబ్లిక్.
  • రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న అంతర్గత విబేధాలు. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్య తారాస్థాయికి చేరుకున్న విభేదాలు . గెహ్లాట్ తీరుపై సచిన్ పైలెట్ అసంతృప్తి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేసేందుకు తన వర్గం శాసన సభ్యులతో ఢిల్లీ పయనం.

భారీ కుట్రకు ఐసీస్ ప్లాన్..

ISIS Plans to Attack in India, భారీ కుట్రకు ఐసీస్ ప్లాన్..

భారత్‌లో భారీ విధ్వంసానికి ఐసీస్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకంటే ముందే.. దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతాదళాలను హెచ్చరించారు. సోమవారం జరగనున్న బక్రీద్ ప్రార్థనల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐబీ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను టార్గెట్‌గా చేసుకుని దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. ఐసిస్ సహకారంతో జేషే, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ కుట్రకు తేరలేపినట్లు ఐబీ గుర్తించింది.

కాగా, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు.. కశ్మీర్‌ను విభజించిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌లో దాడులకు ఉగ్రమూకలను పురిగొల్పే విధంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌లో పుల్వామా తరహా దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోనున్నాయని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

Related Tags