ఆ 54 మందిని చంపేసింది మేమే: ఐసిస్

శుక్రవారం ఉగ్రదాడితో  ఆఫ్రికా అట్టుడుకుపోయిన విషయం తెలిసిందే. మాలీ సైనిక స్థావరంపై దాడి చేసి.. 53 మంది సైనికులను హతమార్చింది మేమే అంటూ.. ఐసిస్ ప్రకటించింది. శుక్రవారం.. నైజర్ సమీపంలోని నార్తర్న్ మాలీలోని ఓ మిలిట‌రీ స్థావరంపై ఉగ్రవాదులు జ‌రిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తొలుత మేనక ప్రాంతంలోని ఓ మిలటరీ ఔట్‌పోస్టును ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ దాడికి దిగారు. అనంతరం.. మాలిలోని మిలటరీ స్థావరంపై […]

ఆ 54 మందిని చంపేసింది మేమే: ఐసిస్
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2019 | 11:51 AM

శుక్రవారం ఉగ్రదాడితో  ఆఫ్రికా అట్టుడుకుపోయిన విషయం తెలిసిందే. మాలీ సైనిక స్థావరంపై దాడి చేసి.. 53 మంది సైనికులను హతమార్చింది మేమే అంటూ.. ఐసిస్ ప్రకటించింది. శుక్రవారం.. నైజర్ సమీపంలోని నార్తర్న్ మాలీలోని ఓ మిలిట‌రీ స్థావరంపై ఉగ్రవాదులు జ‌రిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తొలుత మేనక ప్రాంతంలోని ఓ మిలటరీ ఔట్‌పోస్టును ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ దాడికి దిగారు. అనంతరం.. మాలిలోని మిలటరీ స్థావరంపై దాడి చేశారు. అయితే.. మాలీ మిలటరీ స్థావరంపై దాడికి దిగింది మేమే అంటూ ఐసిస్ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మేనకా నగరంలో రోనస్‌ పాయింట్‌లో ప్రయాణిస్తున్న వాహనంపై టెర్రరిస్టులు దాడి చేయగా.. ఓ ఫ్రెంచ్ సైనికుడు మరణించాడని.. ఫ్రెంచ్ రక్షణ శాఖ ప్రకటించింది. కాగా.. ప్రాణాలు కోల్పోయిన ఫ్రెంచ్ సైనికుడికి.. నివాళి తెలిపారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రైన్. అలాగే.. మాలీ సరిహద్దు ప్రాంతంలో పోరాడుతున్న ఫ్రెంచ్, ఆఫ్రికన్ దళాలకు సంఘీభావం తెలిపారు. త్వరలోనే మాలీని సందర్శిస్తానని మెక్రైన్ పేర్కొన్నారు.