అవును.. వారిని చంపేశాం: ఐసిస్ ప్రకటన

తమ చెరలో బందీలుగా ఉన్న 11మంది క్రైస్తవులను చంపేసినట్లు ఐసిస్‌తో జతకట్టిన నైజీరియా జిహాదీలు ప్రకటించారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రచార విభాగమైన అమక్ గురువారం ఓ వీడియోను విడుదల చేసింది. 11 మంది బందీల కళ్లకు గంతలు కట్టిన ఐసిస్ పశ్చిమ ఆఫ్రికా ఫ్రావిన్స్ ఉగ్రవాదులు వారిలో ఒకరిని కాల్చి చంపారు. మిగిలిన వారి తలలు నరికి చంపేశారు. ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ మరణానికి ప్రతీకారంగానే వీరిని చంపేసినట్లు జిహాదీలు ఈ […]

అవును.. వారిని చంపేశాం: ఐసిస్ ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 8:03 AM

తమ చెరలో బందీలుగా ఉన్న 11మంది క్రైస్తవులను చంపేసినట్లు ఐసిస్‌తో జతకట్టిన నైజీరియా జిహాదీలు ప్రకటించారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రచార విభాగమైన అమక్ గురువారం ఓ వీడియోను విడుదల చేసింది. 11 మంది బందీల కళ్లకు గంతలు కట్టిన ఐసిస్ పశ్చిమ ఆఫ్రికా ఫ్రావిన్స్ ఉగ్రవాదులు వారిలో ఒకరిని కాల్చి చంపారు. మిగిలిన వారి తలలు నరికి చంపేశారు. ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ మరణానికి ప్రతీకారంగానే వీరిని చంపేసినట్లు జిహాదీలు ఈ సందర్భంగా ప్రకటించారు.

కాగా మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరొందిన ఐసిస్ వ్యవస్థాపకుడు అబూ బకర్‌ను ఈ ఏడాది అమెరికా సైన్యాలు తుదముట్టించాయి. సిరియన్ కుర్దు దళాలతో కలిసి అమెరికా సైన్యాలు చేసిన సంయుక్త ఆపరేషన్లో అబూ బకర్ మృతి చెందాడు. అబూ బకర్‌తో పాటు ఆయన వారసుడిగా పేరొందిన అబు హసన్ అల్ ముహజిర్‌, మరికొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు సైనికులు. దీంతో ప్రపంచానికి కాస్త విముక్తి లభించినట్లైంది. అయితే తమ సంస్థకు కొత్త నాయకుడిని ఎన్నుకున్న ఐసిస్.. ప్రపంచవ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.