విండీస్ టూర్: శాంసన్‌ను తప్పించడానికి.. కోహ్లీనే కారణమట!

సంజూ శాంసన్.. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించడంతో ఈ యంగ్ వికెట్ కీపర్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంకేముంది బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే టీమిండియాలో చోటు దక్కింది కానీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడడానికి అవకాశం రాలేదు. బంగ్లాదేశ్ టూర్ అయిపోయింది.. డిసెంబర్ 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సిరీస్‌కు అనూహ్యరీతిలో సంజూ శాంసన్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. […]

విండీస్ టూర్: శాంసన్‌ను తప్పించడానికి.. కోహ్లీనే కారణమట!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:06 PM

సంజూ శాంసన్.. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించడంతో ఈ యంగ్ వికెట్ కీపర్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంకేముంది బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే టీమిండియాలో చోటు దక్కింది కానీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడడానికి అవకాశం రాలేదు. బంగ్లాదేశ్ టూర్ అయిపోయింది.. డిసెంబర్ 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సిరీస్‌కు అనూహ్యరీతిలో సంజూ శాంసన్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. కాగా, శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక అవేంటంటే.. మొదటి కారణం.. వికెట్ కీపర్ రిషబ్ పంత్.. అతడు అటు బ్యాట్, ఇటు గ్లోవ్స్‌ రెండింట్లోనూ విఫలమైనా.. నిలదొక్కుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావించిందట. ఇక రెండో పెద్ద రీజన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చాలారోజుల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి కెప్టెన్ రావడంతో.. సంజూ శాంసన్‌ను తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
దేశవాళీ క్రికెట్‌లో ఎంతో అద్భుతంగా రాణిస్తున్న శాంసన్‌ను అర్ధాంతరంగా తప్పించడంతో నెటిజన్లు ఇప్పటికే ఎంఎస్కే ప్రసాద్ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు విండీస్ టూర్‌కు ఎంపిక కాకపోవడంతో .. శాంసన్ కూడా తన బాధను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.