Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

కేకే యూటర్న్.. హరీష్ రావు మౌనం.. ఆర్టీసీ సమ్మె కొలిక్కి రానుందా?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా.. చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ కొత్తవారిని నియమించుకోవడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అటు సమ్మెలో పాల్గొన్న కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ చెప్పడంతో కొంతమంది ఉద్యోగం పోయిందన్న భయంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరైతే గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రి పాలయ్యారు. మరెన్నో ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం హైకోర్టు వ్యాఖ్యలు కార్మికులకు కాస్త ఊరటనిచ్చాయి. ‘సమ్మెను వెంటనే విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అటు ప్రభుత్వాన్ని కూడా దాదాపు మందలించిన తీరులో వ్యాఖ్యలు చేసింది.

ఇక ప్రభుత్వం అయితే ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. అటు ఆర్టీసీ జేఏసీ మాత్రం యాజమాన్యం, ప్రభుత్వం ఇద్దరిలో ఎవరు చర్చలకు పిలిచినా.. తాము వస్తామని.. ఆ తర్వాతే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు రెండు రోజుల క్రితం కేకే.. ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వం చేయాలని అనుకున్నా కుదరలేదు. ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒకటే.. ఆర్టీసీ జేఏసీకి, ఆర్ధిక మంత్రి హరీష్ రావుకి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉన్నా.. కేకే ఎందుకు సీన్‌లోకి వచ్చారు.

గతంలో టీఎంయూ (తెలంగాణ మజూర్ యూనియన్) గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీష్ రావు.. ఆర్టీసీ సమ్మె ఉద్రిక్త రూపం దాల్చినా ఇప్పటివరకు మౌనంగా ఎందుకు ఉన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కొందరైతే ఆర్టీసీ సమ్మె వెనుక ఆయన హస్తం ఉందని అభిప్రాయపడుతున్నారు కూడా. అయితే దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు తమకు దేవుడని అన్నారు. గతంలోనే కాదు ఎప్పుడూ ఇదే మాటకు కట్టుబడి ఉంటామన్నారు. అలాగని సమ్మెకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. హరీష్ రావు కార్మికులకు అండగా నిలిచారని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలోకి ఆయన్ను లాగొద్దని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఫిబ్రవరిలోనే హరీశ్ రావు రాజీనామా చేశారని.. ఆ తర్వాత తమకు ఎవరూ గౌరవాధ్యక్షుడు లేరన్నారు. అటు హరీష్ రావు అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో అశ్వత్థామరెడ్డికి కీలక బాధ్యతులు అప్పగిస్తూ.. ఆయన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడ్డారని సమాచారం. అలాంటప్పుడు ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావును రంగంలోకి దింపితే.. ఈ వ్యవహారానికి సరైన పరిష్కారం దొరికేది. కానీ కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా చేశారు. మరోవైపు ఇప్పటికే హైకోర్టు విచారణను 18వ తేదికి వాయిదా వేయడంతో.. రెండు రోజుల్లో సమ్మె కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.