Breaking News
  • మధ్యప్రదేశ్ లో ఒకే ఇంట్లో 8 మందికి కరోనా పాజిటివ్. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా లో ఒకే ఫ్యామిలీ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడి. గతం లో ఒక ఇంటి సభ్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడించిన అధికారులు. అన్ని కూడా కాంటాక్ట్ కేస్ లు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • చెన్నై విలుపురంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఐసోలేషన్ వార్డు నుండి పరారీ. గతనెలలో విలుపురం వచ్చిన ఢిల్లీకి చెందిన వ్యక్తి. కరోనా పాజిటివ్ తెలియగానే కలెక్టరేట్ లో‌ని ఐసోలేషన్ వార్డు నిండి పరారీ. ఆ వ్యక్తి ఆచూకి తెలపాలంటూ పోటో విడుదల చేసిన పోలీసులు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ. విద్యుత్ సంస్థలు రీలివ్ చేసిన ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతపై సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసిన ధర్మాధికారి కమిటీ. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు .

టాలీవుడ్‌కి మంచి రైటర్లు కావలెను!

Is Tollywood In Lack Of Writers, టాలీవుడ్‌కి మంచి రైటర్లు కావలెను!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ల కరువు ఏర్పడిందా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కొత్త రచయితలు లేనట్లుగా ఎక్కడో కొరియన్, హాలీవుడ్, చైనీస్, ఫిలిప్పైన్స్ సినిమాలను తర్జుమా చేసి మరీ కోట్లు పోసి తీస్తున్నారు. పోనీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధిస్తున్నాయా అంటే అంత సీన్ లేదు. ఒకటి రెండు తప్పితే మిగిలినవన్నీ డిజాస్టర్లు అవుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే పరాయి భాషా సినిమాను స్టార్ హీరోలతో తీసి.. అదంతా తమ సొంత తెలివితేటలే అని చెప్పుకుంటున్నారు. పైగా లాజిక్స్ తీసి మరి వేరే భాషలో తీసిన మూవీ రీమేక్ అని.. మేము అడాప్ట్ చేసుకున్నాం అని మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోవడంతో ప్రేక్షకులు ఇట్టే నిజాలేంటో కనిపెట్టేస్తున్నారు. దీని ఫలితంగా ప్రేక్షకుల్లో వారు చులకనవ్వడం తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇదంతా పక్కన పెడితే అసలు తెలుగు రైటర్స్‌లో క్రియేటివిటీ గొడ్డు పోయిందా అంటే అదేమీ లేదు. ఎన్నో చిన్న సినిమాలు వైవిధ్యమైన కథలతో తెరకెక్కి భారీ హిట్స్ సాధిస్తున్నాయి.

స్టార్ హీరోల చుట్టూ ఉండే బోర్డర్ లైన్ కావచ్చు.. లేదా కొత్త రైటర్లతో ఎందుకు వచ్చిన తంటా అనుకోవచ్చు.. కొందరు మినహాయించి మిగిలిన వారెవ్వరూ రిస్క్ తీసుకోవడం మానేశారు. ఇది అలా ఉంచితే ఎన్నో కథలు రాసుకున్న బ్యాచ్… అవి సూట్ అయ్యే హీరోల దాకా వెళ్లే మార్గం తెలియక కృష్ణానగర్‌‌లోనే తచ్చాడుతున్నారు. ఎక్కడో ఒకరు రిస్క్ చేసి తక్కువ బడ్జెట్‌తో సినిమాలు రూపొందిస్తున్నారు. అదే కోవలో వచ్చిందే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా. అది తక్కువ బడ్జెట్‌తో రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ఆ సినిమాలో నటించిన వారే కాదు.. తెరకెక్కించిన వారు కూడా షార్ట్ ఫిలిమ్స్ బ్యాచ్ అని చెప్పవచ్చు.

ఇలా ఎంతోమంది కొత్త రచయితలు వారి కథలతో ఎండా వానా లెక్కచేయకుండా తిరుగుతున్నారు. మన నిర్మాతలు వీటి గురించి అలోచించి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపు బడా బడ్జెట్, కాంబినేషన్స్ మీద దృష్టి పెట్టడం తప్ప వేరే ధాస్య లేదు. ఈ తీరు మారనంత కాలం కథలకు కొరత వస్తూనే ఉంటుంది.

Related Tags