ఇలియానా బ్రేకప్‌కు అసలు కారణమిదేనా.?

Why Ileana Split With Andrew Kneebone, ఇలియానా బ్రేకప్‌కు అసలు కారణమిదేనా.?

ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, నటి ఇలియానా గత నెలలో తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. మనస్పర్థలు లేదా అభిప్రాయభేదాలతో ఇద్దరూ విడిపోయి ఉంటారని ఫ్యాన్స్ భావించారు. అయితే ఇల్లీ బేబీ, ఆండ్రూ విడిపోవడానికి డబ్బే ప్రధాన కారణమని తెలుస్తోంది. అసలు సంగతేంటంటే కెరీర్ ఎత్తుపల్లాలో ఉండటం వల్ల సినిమాలను పక్కన పెట్టి ఆండ్రూను పెళ్లి చేసుకుని సెటిల్  అయిపోదామని ఇలియానా అనుకుందట! ఇక ఈ విషయమే ఆండ్రూకి రుచించలేదంటున్నారు బీ టౌన్ జనాలు. సినిమాలు చేయమని ఆమె మీద ఒత్తిడి తెచ్చేవాడట. ఈ ఒత్తిడి తట్టుకోలేకే ఇలియానా పలు సినిమాల్లో ఇష్టం లేకపోయినా నటించిందని సమాచారం. అయితే ఆమె నటించిన తెలుగు, హిందీ సినిమాలు డిజాస్టర్స్ కావడంతో మరిన్ని ఆఫర్స్ తలుపు తట్టలేదు.

దానితో ఇన్ని రోజులు ఇలియానా డబ్బులతో ఎంజాయ్ చేసిన ఆండ్రూ ఆమెను దూరం పెడుతూ.. వేధించడం మొదలుపెట్టాడని తెలుస్తోంది. ఇక ఇదే ఇద్దరి మధ్య బ్రేకప్‌కు దారి తీసింది. కాగా ప్రస్తుతం ఇలియానా గతాన్ని మర్చిపోయి మళ్ళీ తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. మునపటిలానే ఇల్లీ బేబీ సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *