‘ అది మార్కెట్ లో కొత్త బిస్కెట్ ‘.. 50 : 50 పై ఒవైసీ సెటైర్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ-శివసేన మధ్య కొనసాగుతున్న సిగపట్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెరైటీగా స్పందించారు. ‘ 50 : 50 అన్నది మార్కెట్ లో కొత్త బిస్కెట్ లా ఉంది ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. (అధికారాన్ని చెరి సగం పంచుకునేందుకు శివసేన.. బీజేపీతో 50 : 50 షేరింగ్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన సంగతి విదితమే. అయితే ఈ ఫార్ములా పట్ల బీజేపీ విముఖత చూపుతోంది.) తాము బీజేపీకి గానీ, శివసేనకు […]

' అది మార్కెట్ లో కొత్త బిస్కెట్ '.. 50 : 50 పై ఒవైసీ సెటైర్
Follow us

|

Updated on: Nov 07, 2019 | 6:11 PM

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ-శివసేన మధ్య కొనసాగుతున్న సిగపట్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెరైటీగా స్పందించారు. ‘ 50 : 50 అన్నది మార్కెట్ లో కొత్త బిస్కెట్ లా ఉంది ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. (అధికారాన్ని చెరి సగం పంచుకునేందుకు శివసేన.. బీజేపీతో 50 : 50 షేరింగ్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన సంగతి విదితమే. అయితే ఈ ఫార్ములా పట్ల బీజేపీ విముఖత చూపుతోంది.) తాము బీజేపీకి గానీ, శివసేనకు గానీ మద్దతు తెలుపబోమని ఒవైసీ స్పష్టం చేశారు. ‘ 50 : 50 అంటే ఏమిటి ? ఇది మార్కెట్లో లభించే కొత్త బిస్కెట్టా ? ముందు మహారాష్ట్ర ప్రజలకోసం ఏదో ఒకటి చేయండి.. సతారా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు మిగిల్చిన నష్టాల గురించి బీజేపీ గానీ, సేన గానీ పట్టించుకున్నాయా ? సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ‘ అంటే ఇదేనా ? ‘ అని ఒవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్రలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం రెండు సీట్లను గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో ఫడ్నవీస్ గానీ, మరొకరు గానీ సీఎం అవుతారా కారా అన్న విషయం తనకు తెలియదని, అంతా ‘ మ్యూజికల్ చైర్స్ ‘ ఆట ఆడుతున్నారని ఒవైసీ పేర్కొన్నారు. అసలు ఏం చేయాలో శివసేనకు తోచడం లేదని, ప్రధాని మోదీ అంటే ఉధ్ధవ్ థాక్రే భయపడినట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.