చిరు, చరణ్‌ల మల్టీస్టారర్ అదేనా..?

దసరా పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో కలిసి సినిమా చేస్తానని చిరు చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించే సినిమాపై ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రైట్స్‌ను రామ్ చరణ్ కొన్నారు. ఈ సినిమాలోనే చిరు, చెర్రీలు కలిసి […]

  • Ravi Kiran
  • Publish Date - 1:09 am, Wed, 9 October 19

దసరా పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో కలిసి సినిమా చేస్తానని చిరు చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించే సినిమాపై ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రైట్స్‌ను రామ్ చరణ్ కొన్నారు. ఈ సినిమాలోనే చిరు, చెర్రీలు కలిసి నటించబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘లూసిఫర్’‌లో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి.. పృథ్వీరాజ్ రోల్‌లో రామ్ చరణ్ కనిపిస్తారని ఇన్‌సైడ్ టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం.

రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే చిత్రం దసరా పండుగ రోజున పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కాగా, ఈ చిత్రం పూర్తయిన తర్వాత చిరు ‘లూసిఫర్’ రీమేక్‌ను పట్టాలెక్కిస్తారని సమాచారం. హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తాడు.