డబుల్ షిఫ్ట్ చేస్తోన్న జక్కన్న.. వారిని పిండుతున్నాడట..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మొదటిసారి కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుండగా.. షూటింగ్‌ను ఆగమేఘాల మీద నడిపిస్తున్నాడు జక్కన్న. రాత్రింబవళ్లు తేడా లేకుండా క్షణం కూడా తీరిక లేకుండా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ చేస్తున్నారని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పగలు చెర్రీపై.. రాత్రి ఎన్టీఆర్‌పై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడట రాజమౌళి.  అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ గురించి […]

డబుల్ షిఫ్ట్ చేస్తోన్న జక్కన్న.. వారిని పిండుతున్నాడట..!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 11:03 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మొదటిసారి కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుండగా.. షూటింగ్‌ను ఆగమేఘాల మీద నడిపిస్తున్నాడు జక్కన్న. రాత్రింబవళ్లు తేడా లేకుండా క్షణం కూడా తీరిక లేకుండా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ చేస్తున్నారని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పగలు చెర్రీపై.. రాత్రి ఎన్టీఆర్‌పై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడట రాజమౌళి.  అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ గురించి తాజాగా ఓ వీడియోను ఇన్ ఇన్‌స్టాలో పెట్టాడు చెర్రీ. మార్నింగ్ షూటింగ్‌కు వెళ్తున్నా అంటూ చెర్రీ అందులో పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చెర్రీ, ఎన్టీఆర్‌లపై విడివిడిగా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈ షెడ్యూల్ తరువాత ఎన్టీఆర్‌కు కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వనున్నాడట రాజమౌళి. ఆ సమయంలో కోకాపేట్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చెర్రీతో ఓ షెడ్యూల్‌ను తెరకెక్కించనున్నాడని సమాచారం.

ఇక ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెర్రీ, అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్, కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చెర్రీ సరసన కనిపించనుండగా.. అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మల్టీలింగువల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీపై ప్రతి ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు