Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

టీమిండియా నెంబర్ 4 స్లాట్‌కు శ్రేయాస్ అయ్యర్ ఫిక్స్..?

Shreyas Iyer Finally Solved Number 4 Problem Of Indian Team, టీమిండియా నెంబర్ 4 స్లాట్‌కు శ్రేయాస్ అయ్యర్ ఫిక్స్..?

శ్రేయాస్ అయ్యర్…  ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌‌లో టీమిండియా తరపున మిడిల్ ఆర్డర్‌లో అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. మూడు మ్యాచులూ పరిశీలిస్తే.. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్లలో శ్రేయాస్ అయ్యర్‌దే అత్యధిక స్ట్రైక్ రేట్(183.05). ఇక ఇప్పుడు ఇతడి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ టీ20 మ్యాచుల్లో నెంబర్ 4 స్థానంలో దిగి అతడు పరుగులన్నీ రాబట్టాడు.

ఇదిలా ఉండగా టీమిండియాకు నెంబర్ 4 స్థానం ఎప్పటినుంచో సమస్యగా మారింది. గతంలో ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో కూడా విరాట్ కోహ్లీ చాలామందిని ఈ ప్లేస్‌లో ప్రయత్నించగా.. అందరూ కూడా విఫలమయ్యారు. ఇక ప్రపంచకప్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రీసెంట్‌గా జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌లో సైతం ఇండియా తరపున మూడు మ్యాచులకు గానూ అత్యధిక పరుగులు(108) సాధించాడు.

అయ్యర్ జట్టులో చోటు సంపాదించిన తర్వాత వన్డేలు, టీ20ల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తూ..  స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. అంతేకాకుండా టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నుముకలా నిలుస్తున్నాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌ను గమనిస్తే.. టీమిండియాకు తప్పకుండా నాలుగో స్థానం భర్తీ అయిందనే చెప్పాలి.