Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

మకర జ్యోతి నిజమా ? కల్పితమా ?

What's the truth behind the Makara Jyothi that comes up every Sankranti at Shabarimalaya, మకర జ్యోతి నిజమా ? కల్పితమా ?

మకర సంక్రాంతి పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది మకర జ్యోతి ! ఈ జ్యోతిని కనులారా వీక్షిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని అయ్యప్ప భక్తుల ప్రగాఢ నమ్మకం. సాయం సంధ్య వేళ పొన్నంబళమేడు పర్వతంపై కన్పించే వెలుగు అయ్యప్ప మహిమగానే భక్తులు భావిస్తారు. అసలు మకర జ్యోతి నిజమా ? కల్పితమా ? ట్రావెన్‌ కోర్‌ బోర్డు ఏమంటోంది ?

కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శబరిమల ! పశ్చిమ కనుమల్లో కొలువైన ఈ పుణ్యక్షేత్రానికి నవంబర్‌, జనవరి నెలల్లో దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తారు ! 41 రోజుల పాటు కఠోర దీక్షలు చేసి అయ్యప్ప కటాక్షం పొందుతారు. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఎన్నో అద్భుతాలకు నిలయం ! అందులో ఒకటే మకర జ్యోతి ! .మకర సంక్రాంతి రోజు లేదా ఆ ఘడియల్లో కొండపై నుంచి భక్తులందరికీ కనిపించే వెలుగే మకర జ్యోతి ! దీన్ని ఓ నక్షత్రంగా చెబుతారు ! మకర విళక్కుగా పిలుస్తారు ! భక్తులంతా దర్శించుకునే, కొండపై మకర జ్యోతి 3 సార్లు కన్పిస్తుంది. మకర జ్యోతిని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. అందుకే సంక్రాంతి సమయంలో శబరిమల కిక్కిరిసిపోతుంది !

2011లో జరిగిన ఓ ఘటనతో… మకర జ్యోతి నిజమా ? కల్పితమా ? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. 2011 జనవరి 14న మకర జ్యోతిని వీక్షించటానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 106 మంది భక్తులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో రావటానికి కారణమయ్యే మకరజ్యోతి వివాదాస్పద అంశంగా మారింది. అసలు ఈ జ్యోతి నిజమా ? కల్పితమా ? అన్నది తేల్చాలని…. ప్రజలకు వాస్తవాలు తెలపాలంటూ హేతువాద, మానవవాద సంఘాలు కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాయి.

మకర సంక్రాంతి రోజున కొండపై నుంచి భక్తులందరికీ కనిపించే జ్యోతిని… పొన్నంబళమేడు పర్వతంపై దేవస్థానం బోర్డు ఉద్యోగులు అయిన గిరిజనులు వెలిగిస్తారు. ఇదొక దీపం అని, దీనిని వెలిగించేది మనుషులేనని దేవస్థానం బోర్డు కూడా స్వయంగా అంగీకరించింది. శబరిగిరికి తూర్పు వైపున ఉన్న పొన్నంబళమేడు పర్వతం.. శబరిమల ఆలయానికి మూలాస్థానమని భక్తుల నమ్మకం. ప్రాచీన కాలంలో పొన్నంబళమేడు మీద ఒక ఆలయం ఉండేది ! ఆ ఆలయంలో నిరంతర పూజలు జరిగేవి. ఆ తర్వాత ఆ ఆలయం శిథిలమైపోయింది !

పొన్నంబళమేడు మీద ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరుకున్నా… ఇప్పటికీ అక్కడ పూజలు జరుగుతాయి. ఆలయం శిథిలమైనా ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు.. మకర సంక్రాంతి రోజున దీపారాధన సహా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే కాలక్రమంలో గిరిజనులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. కానీ ఉద్యోగ రీత్యా అక్కడే ఉండిపోయిన కొందరు గిరిజనులు ఆ రోజున పూజలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా దీపారాధన కూడా చేస్తారు. అయితే మకర సంక్రాంతి రోజున కనిపించే జ్యోతి దైవికమైనది కానీ, మానవాతీత శక్తి ద్వారా ఏర్పడిందని కానీ ట్రావెన్‌కోర్‌ బోర్డు ఎప్పుడు చెప్పలేదు. కానీ మకర సంక్రాంతి రోజున అక్కడ ఆ దీపం కనిపిస్తుందనేది మాత్రం

ఇది మత విశ్వాసాలకు సంబంధించినది కావడంతో ఇందులో తాము జోక్యం చేసుకోమని అప్పటి కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది మతానికి సంబంధించిన విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలకు సంబంధించిన అంశం కనుక దీనిపై దర్యాప్తు అవసరం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. కొండపై జ్యోతి నిజమా ? కల్పితమా ? అన్నది పక్కన పెడితే మకర సంక్రాంతి రోజు ఆ జ్యోతి ఓ నక్షత్రంలా ప్రకాశిస్తూ భక్తులను సాక్షాత్కరిస్తుందన్నది మాత్రం నిజం !