మిక్స్‌డ్ టాక్.. అయితే కలెక్షన్స్ ఫుల్.. ‘సాహో’ ఫస్ట్ డే ‘వ్యూ’!

‘సాహో’ మేనియా…  రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీకి మొదటి రోజే మిక్స్‌డ్ రివ్యూస్ రావడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాత్రం.. కథ, కథనంలో కొత్తదనం లేదని.. ఓన్లీ యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేయడం వల్ల సినిమాకు మైనస్ అయిందని అంటున్నారు. […]

మిక్స్‌డ్ టాక్.. అయితే కలెక్షన్స్ ఫుల్.. 'సాహో' ఫస్ట్ డే 'వ్యూ'!
Follow us

|

Updated on: Aug 31, 2019 | 2:33 PM

‘సాహో’ మేనియా… 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీకి మొదటి రోజే మిక్స్‌డ్ రివ్యూస్ రావడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాత్రం.. కథ, కథనంలో కొత్తదనం లేదని.. ఓన్లీ యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేయడం వల్ల సినిమాకు మైనస్ అయిందని అంటున్నారు. అంతేకాకుండా హీరో క్యారెక్టర్‌కు ఇచ్చిన ఎలివేషన్ పీక్స్ చేరడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నది వారి అభిప్రాయం.

భారీ యాక్షన్.. కథ తుస్…

సినిమా చూసిన ప్రేక్షకుడిగా చెప్పాలంటే.. దర్శకుడు సుజీత్ హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించడం అభినందనీయమే. కానీ దానికి తగ్గట్టు కథ లేకపోవడం వల్ల అంతగా కనెక్ట్ కాలేదు. అంతేకాకుండా హీరో ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అతడు కథ రాసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది.. అయితే బడ్జెట్ 100 కోట్ల లోపు పూర్తి చేసి ఉంటే బాగుండేదని కానీ ఇలా అత్యధిక బడ్జెట్.. 350 కోట్లు వ్యయం చేసి సాదాసీదా మూవీ తీయడం పైగా అందులో కంటెంట్ లేకపోవడం వంటివి ఖచ్చితంగా వసూళ్ల మీద భారీ ఎఫెక్ట్‌కు దారి తీసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

తెలుగు సినిమానా.. బాలీవుడ్ సినిమానా… 

ఇక ‘సాహో’ సినిమాను చూసిన తర్వాత అందరిలోనూ మెదిలే ప్రశ్న. ఇంతకీ మనం చూసేది తెలుగు సినిమానేనా.. లేక బాలీవుడ్ సినిమానా అని. ఎందుకంటే తెలుగు నేటివిటీకి దూరంగా హిందీ ఫ్లేవర్ ఎక్కువగా పెట్టడం జరిగింది. స్కిన్ షోతో కూడిన పాటలు, సెపరేట్ ఆల్బం సాంగ్స్ సరిగ్గా సూట్ కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

‘బాహుబలి’ ఎఫెక్ట్…

ప్రభాస్ గత చిత్రం ‘బాహుబలి’ సిరీస్ ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఆ ఎఫెక్ట్ ప్రభాస్ తర్వాతి చిత్రాలపై పడుతుంది. సరిగ్గా ‘సాహో’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంలో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు. ‘బాహుబలి’  తర్వాత ఫ్యాన్స్‌లో ప్రభాస్ తదుపరి చిత్రంపై ఓవర్ ఎక్స్‌పెటేషన్స్ ఉంటాయి. అలా అని 60 కోట్ల కథకు.. 350 కోట్లు పెట్టడం కరెక్ట్ కాదని నెటిజన్లు భావన.

సుజీత్ అనుభవలేమి…

సుజీత్.. ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ సినిమాకు పరిచయం అయిన ఈ దర్శకుడు. రెండో సినిమాగా ‘సాహో’ను తెరకెక్కించాడు. సెకండ్ సినిమానే ఇండియన్ పాన్ మూవీని రూపొందించడం కత్తి మీద సామే కానీ దర్శకధీరుడు రాజమౌళి అనుభవం అపారమైనది.. ఆయన ఐడియా స్ట్రాటజీ.. టేకింగ్ అద్భుతంగా ఉంటుంది. చిన్న సినిమా తీసినా.. పెద్ద సినిమా తీసినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తాడు. అంతేకాకుండా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న అద్భుత కథనం కూడా ‘బాహుబలి’ అనూహ్య విజయానికి దోహదపడింది. ఇక జక్కన్న మాదిరిగానే సుజీత్ ‘సాహో’ను తెరకెక్కిస్తాడన్న ఆశలు ఉన్నా.. ఈ ఆశలు ఆవిరి అయ్యాయి. ఇలా చెప్పాలంటే.. ‘సాహో’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడానికి మరెన్నో కారణాలు ఉన్నాయి.