లాస్ ఏంజిల్స్‌లో ప్రభాస్, అనుష్క లవ్ ట్రాక్..? మధ్యలో మరో ట్విస్ట్!

Prabhas And Anushka Dating News, లాస్ ఏంజిల్స్‌లో ప్రభాస్, అనుష్క లవ్ ట్రాక్..? మధ్యలో మరో ట్విస్ట్!

రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ఈ స్టార్ గురించి బాలీవుడ్ మీడియాలో కూడా పలు ఆసక్తికరమైన కథనాలు ప్రచురితమవుతున్నాయి.

అమెరికాలో సెటిలైన ఓ తెలుగు వ్యాపారవేత్త కూతురును ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు పక్కన పెడితే.. హీరోయిన్ అనుష్కతో మరోసారి ప్రభాస్‌ను జోడించి బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క తనకు స్నేహితురాలు మాత్రమేనని.. తమ ఇద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని డార్లింగ్ ఎన్నిసార్లు చెబుతున్నా.. నెట్టింట్లో రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా వీరిద్దరి మీద వచ్చిన మరో గాసిప్ వైరల్‌గా మారింది.

అనుష్కతో ప్రభాస్ లవ్ ఎఫైర్ నడుస్తోందని.. ఇద్దరూ కూడా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఇంటి కోసం వెతుకుతున్నారని కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్‌లోని సీక్రెట్ స్పాట్లో ఇద్దరూ రహస్యంగా కలుస్తున్నారని.. ‘సాహో’ స్పెషల్ స్క్రీనింగ్‌కు కూడా ఆమెను తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రూమర్స్ అన్ని ప్రక్కన పెడితే.. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ‘సాహో’ సినిమా ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *