Breaking News
  • అనంతపురం: ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ నిర్వాకం. పెనుకొండ దగ్గర నిలిచిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు. రాత్రి నుంచి బస్సులోనే ప్రయాణికుల పడిగాపులు. బస్సును రోడ్డుపై వదిలి పరారైన డ్రైవర్‌, క్లీనర్‌. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు. మార్గం మధ్యలో బస్సుకు ఆరుసార్లు మరమ్మతులు. పట్టించుకోని ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలంటున్న ప్రయాణికులు.
  • చెన్నై ఐఐటీలో మరో వివాదం. ప్రాజెక్ట్ మేనేజర్‌ బెనర్జీపై విద్యార్థినుల ఫిర్యాదు. మొబైల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడని ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. బెనర్జీ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు. కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
  • నెల్లూరు: మర్రిపాడు మండలం అల్లంపాడులో ముగ్గురు అరెస్ట్‌. గుప్తనిధులు తవ్వకాలు చేస్తున్నారన్న అనుమానంతో అరెస్ట్‌. పరారీలో మరో ఇద్దరు, కారు స్వాధీనం.
  • ప్రధాని అధ్యక్షతన 2016లో జరిగిన సమావేశంలో.. అన్నిరాష్ట్రాల్లో టెలీహెల్త్‌ సర్వీస్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఏపీ కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ అధికారులతో సమావేశం నిర్వహించాం. తెలంగాణలో అమలులో ఉన్నందున అదే విధానాన్ని అమలు చేయమని చెప్పా. తెలంగాణ ఈఎస్‌ఐ అధికారులు టెలీ హెల్త్ సర్వీస్‌తో.. ఎంవోయూ చేసుకోమనడంతో నేను లెటర్‌ రాశా. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా టెండర్ల పద్ధతి ద్వారా.. మందులు కొనుగోలు చేయాలని మంత్రిగా ఆదేశించా-అచ్చెన్నాయుడు.
  • కార్మికుల సొమ్ముదోచుకున్న అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఈఎస్‌ఐ కుంభకోణాన్ని వెలికి తీయాలి-వైసీపీటీయూసీ నేత గౌతమ్‌రెడ్డి. ఇందులో ఎవరెవరు భాగస్వాములో కూడా వెల్లడించాలి. అచ్చెన్నాయుడును అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి-గౌతమ్‌రెడ్డి.

ఫ్లాప్‌లకు బాధ్యులెవరు..? హీరోనా..! ప్రేక్షకులా..!

Is overconfidence of heroes the main reason for failure of Huge budget movies?, ఫ్లాప్‌లకు బాధ్యులెవరు..? హీరోనా..! ప్రేక్షకులా..!

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ మూవీపై తెలీకుండానే అంచనాలు మొదలయ్యాయి. సుజీత్ టాప్ దర్శకుడు కాకపోయినప్పటికీ.. ఫస్ట్‌లుక్‌లు, టీజర్లు, ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకోవడంతో సాహోపై అంచనాలు తెలీకుండానే భారీగా పెరిగిపోయాయి. అయితే ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రం విమర్శకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఎక్కడా పాజిటివ్ రివ్యూలు రాలేదు. అయితే ఆడియెన్స్ మాత్రం ఈ సినిమాను బానే ఆదరించారు. దీంతో ఇప్పటివరకు మంచి కలెక్షన్లను రాబడుతూ వస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.370కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టిన సాహో.. ఇంకా సత్తాను చాటుతోంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయ్యి మరిన్ని కలెక్షన్లను సాధించినట్లైతే ‘సాహో’ కమర్షియల్ హిట్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. అయితే కంటెంట్ పరంగా మాత్రం సాహో ఫెయిల్ అయిందన్నది మరికొందరి మాట.

ఇదిలా ఉంటే ఒక్క ‘సాహో’ విషయంలోనే ఇలా జరగలేదు. ఇంతకుముందు వచ్చిన పలు చిత్రాల్లోనూ ఇలానే జరిగింది. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొన్ని సినిమాలైతే కనీసం ప్రీ రిలీజ్ బిజినెస్‌ మార్క్‌ను కూడా టచ్ చేయకుండా అట్టర్ ఫ్లాప్‌లుగా నిలిచాయి. వాటిలో ‘అఙ్ఞాతవాసి’, ‘కాటమరాయుడు’, ‘డీజే’, ‘బ్రహ్మోత్సవం’, ‘వినయ విధేయ రామ’, ‘ఎన్టీఆర్- కథానాయకుడు, మహానాయకుడు’ ‘ఆగడు’ ఇలా చాలా చిత్రాలే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి.

అయితే ఈ పరాజయాలకు బాధ్యులెవరు..? హీరోనా..? దర్శకుడా..? ప్రేక్షకులా..? ఈ ప్రశ్నకు సమాధానం అందరూ ఆలోచించాలి. పై చిత్రాలను చూస్తే అన్నీ క్రేజీ కాంబోలో తెరకెక్కినవే. జల్సా, అత్తారింటికి దారేది తరువాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిందే అఙ్ఞాతవాసి. అలాగే గోపాల గోపాల హిట్ తరువాత డాలీకి పవన్ ఇచ్చిన మరో అవకాశం కాటమరాయుడు. ఇక బన్నీ-హరీశ్ శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కింది డీజే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లచెట్టు హిట్ తరువాత మహేష్- శ్రీకాంత్ అడ్డాల కాంబోలో వచ్చింది బ్రహ్మోత్సవం. రంగస్థలం హిట్ తరువాత బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఇలా ఏ సినిమా తీసుకున్నా.. ప్రతీది క్రేజీ కాంబోలో తెరకెక్కింది కావడంతో తెలీకుండానే అంచనాలు పెంచేశాయి. కానీ కంటెంట్‌ లేమితో ఇవన్నీ ఫ్లాప్‌లుగా మిగిలాయి. అయితే ఈ విషయంలో హీరోల తప్పే అధిక శాతం ఉందంటున్నారు కొందరు. ముందు భారీ విజయం తెచ్చిన ఉత్సాహమో..! లేక ఒకసారి హిట్ ఇచ్చిన దర్శకుడు మళ్లీ హిట్ ఇస్తాడులే అన్న ఓవర్ కాన్ఫిడెన్సో..! తెలీదు గానీ ఈ పరాజయాల్లో హీరోల తప్పిదమే ఎక్కువన్నది వారి మాట.

అయితే ఇందులో ప్రేక్షకుల తప్పు కూడా ఉందన్నది మరికొందరి అభిప్రాయం. ఏదైనా ఒక కాంబినేషన్‌లో సినిమా వస్తున్నప్పుడు ప్రేక్షకులు తెలీకుండానే అంచనాలను పెంచేసుకుంటుంటారు. అయితే ఆ అంచనాల ఎఫెక్ట్ ఆ తరువాత దర్శకుడి మీద ఎక్కువగా పడే అవకాశం ఉండటంతో అతడు తడబడి సినిమాను ఫ్లాప్‌ చేస్తున్నాడనేది వారి మాట. అయితే ఇది అందరికీ వర్తించదు. ఇప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న కొందరు టాప్ దర్శకులు మూస కథలనే ఎంచుకుంటుండగా.. మరికొందరు స్క్రిప్ట్ పూర్తి కాకుండానే సెట్స్ మీదకు వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కచ్చితంగా సినిమా ఫ్లాప్‌కు అతడి తప్పే ఉంటుందన్నది కొందరి వాదన. ఏదేమైనా బాహుబలి తరువాత టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. కంటెంట్ పరంగా వైవిధ్యంవైపే మొగ్గుచూపుతున్నారు ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో ఇకపై అయినా టాప్ హీరోలు కాస్త ఆలోచించి స్క్రిప్ట్‌లను ఎంచుకోవాలి. అలాగే ఆడియెన్స్‌లో ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా కెప్టెన్ అయిన దర్శకుడు పాత చింతకాయ పచ్చడి కథలను, స్క్రీన్‌ప్లేలను వదిలి కొత్తగా, క్లారిటీగా సినిమాను తీయగలగాలి. అప్పుడే మన టాలీవుడ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోగలదు.

Related Tags